Monday, December 23, 2024

హిందూ మహిళను ఎత్తుకెళ్లి… అఘాయిత్యం.. ఇస్లామ్‌లోకి మారాలని దాడి

- Advertisement -
- Advertisement -

 

కరాచి: హిందూ మతానికి చెందిన వివాహితను ఎత్తుకెళ్లి అనంతరం ఆమెపై ముగ్గురు సామూహిక అత్యాచారం చేసి ఇస్లాములోకి మారాలని బెదిరించిన సంఘటన పాకిస్థాన్ ప్రాంతం సింధ్ ప్రొవిన్స్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ఉమర్ కోట్ జిల్లా సమారో టౌన్‌లో హిందూ మతానికి చెందిన వివాహితను ఇబ్రాహీం,మంగ్రీయో, పునో మంగ్రీయో అపహరించారు. అనంతరు ఇద్దరు మరో వ్యక్తితో కలిసి మూడు రోజుల పాటు ఆమెపై సామూహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇస్లామ్ మతంలోని మారకుంటే చంపేస్తామని బెదిరించారు.

ఆమె వాళ్ల నుంచి తప్పించుకొని తన ఇంటికి వెళ్లిపోయింది. తన తల్లిదండ్రులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సింధూ ప్రొవిన్స్‌లోని ఉమర్ కోట్, మిర్పుఖాస్, గోట్కీ ప్రాంతంలో హిందువుల జనాభా అధికంగా ఉంది. గత డిసెంబర్ నెలలో ఓ హిందూ మహిళను చంపేశారు. మొండెం నుంచి తలను వేరు చేసి ఛాతీ భాగాన్ని కట్ చేశారు. గత జూన్‌లో ఓ ముస్లిం యువకుడు హిందూ మహిళను పెళ్లి చేసుకొని ఇస్లామ్‌లోనికి మారాలని బలవంతం చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు జరుగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News