- Advertisement -
త్వరలో జరగబోయే పాకిస్తాన్ ఎన్నికల్లో ఒక హిందూ మహిళ పోటీ చేస్తోంది. ఆమె పేరు సవీరా ప్రకాశ్. కొన్ని తరాలుగా సవీరా కుటుంబం పాకిస్తాన్ లోని ఖైబర్ పంఖుంక్వాలోని బునేర్ జిల్లాలో నివసిస్తున్నారు. సవీరా ప్రకాశ్ వృత్తిరీత్యా డాక్టర్. అబోటాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీనుంచి 2022లో డిగ్రీ పట్టా తీసుకున్నారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ బునెర్ జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా సవీరా పనిచేస్తున్నారు. ఆమె తండ్రి ఓం ప్రకాశ్ రిటైర్డ్ డాక్టర్. ఆయన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ తరఫున గత 35 ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్నారు.
సవీరా బునెర్ జిల్లాలోని పికె 25 స్థానంనుంచి పోటీ చేసేందుకు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. బునేర్ నుంచి పోటీకి దిగిన మొట్టమొదటి మహిళ సవీరాయే కావడం విశేషం. తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, పేదలకు సేవ చేయడమే తన లక్ష్యమని సవీరా అన్నారు.
- Advertisement -