Sunday, September 8, 2024

పాక్ ఎన్నికల్లో హిందూ మహిళ పోటీ.. ఎన్ని ఓట్లు వచ్చాయంటే…!

- Advertisement -
- Advertisement -

సవీరా ప్రకాశ్… పాకిస్తాన్ సాధారణ ఎన్నికల్లో పోటీకి దిగిన ఒకే ఒక్క హిందూ మహిళ ఆమె! వృత్తిరీత్యా డాక్టర్ అయిన సవీరా కుటుంబం కొన్ని తరాలనుంచి ఖైబర్ ఫంఖ్తుంక్వా ప్రావిన్స్ లోని బర్నెర్ నియోజకవర్గంలోనే నివసిస్తోంది. వయసు పాతికేళ్లే అయినా రాజకీయాల్లో నిలదొక్కుకోవాలని ఆమె కొంతకాలంగా ప్రయత్నిస్తోంది.

మొన్న 8వ తేదీన జరిగిన పాక్ ఎన్నికల్లో బర్నెర్ నియోజకవర్గంనుంచి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ తరఫున సవీరా నిలబడింది. అయితే ఆమెకు 1700 ఓట్లు మాత్రమే లభించాయి. అయినా నిరాశ చెందకుండా, ఇక ముందు కూడా రాజకీయాల్లో కొనసాగుతానని ప్రకటించింది. తనకు మద్దతుగా నిలబడిన పిపిపి కార్యకర్తలకు, ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ సవీరా ఓ వీడియో ఎక్స్ లో పోస్ట్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News