Wednesday, January 22, 2025

కంపెనీ భూముల్లో కాసుల సేద్యం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కేపీహెచ్‌బి: ఒక నాడు అవి పచ్చటి పంట పొలాలు.వాటినే నమ్ముకొని బతుకులీడ్చిన బడుగుజీవులెన్నో. కులవృత్తిదారులకు అవే ఆదెరువు. ఉన్నట్లుండి ఆ పంట పొలాల్లో ‘బాంబు’ల పిడుగు పడి ఆ బడుగు జీవుల బ్రతుకులను ఛిద్రం చేసింది. ని రక్షరాస్యత, ఆజ్ఞానం, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మీ పొలాల్లో బాంబుల పడతాయని బెదిరించారు.. అదిరించారు. ఇదిగో ఉ ద్యోగమన్నారు… అదిగో ఉపాధి అని అదరగొట్టారు. వినకపోతే లాక్కున్నారు. చేతిలో వె య్యిపెట్టి మర్లిచూడకుండాపొమ్మన్నారు. రా చూస్తే ఉద్యోగం ఇవ్వలేదు.. ఉపాధి కల్పించలేదు. ఏడాదికి మూడుసార్లు చేతికొచ్చే పం ట రాలేదు.. నాడు ఆసాములుగా, భూ స్వా ములుగా దర్జాగా పెరుగన్నం తిని బతికిన బ డుగు రైతులు
నేడు పచ్చడి మెతుకుల కోసం బ్రతుకులీడుస్తూ కుండలు చేసుకుంటూ కొందరు..కమ్మరి పనిచేస్తూ మరికొందరూ…గేదెల పాలు పితుక్కుంటూ , ఆటో, బస్సు డ్రైవర్లుగా… పాన్‌డబ్బాలు పెట్టుకుని కాలం వెళ్ళదీస్తున్న ఆ కుటుంబాలు వారి వారసులు తమ తాత, దండ్రులు ఆసాములు… భూస్వాములు అని..ఈ భూములన్నీ మావే అని చెప్పుకుంటూ ఊరట చెందుతున్న ఐడీఎల్ బాధిత రైతు కుటుంబాల దీనగాధ .. నగర నడిబొడ్డున కూకట్‌పల్లి ప్రాంతంలో ఓ కంపెనీ భూదాహానికి ఛిద్రమైన బాధిత కుటుంబాల వారసులకు తీరని వ్యధ..

రియల్ సంస్థలకు హిందూజా భూ పందేరం
డిటోనేటర్ల తయారీ పరిశ్రమకు కేటాయించిన భూములను పారిశ్రామికేతర అవసరాల కోసం 100 ఎకరాల్లో మాత్రమే భూ బదలాయింపు చేయాలని 2009లో ప్రభుత్వం నుంచి 302 జీవో పొందిన హిందూజా గ్రూపు గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ పదేళ్ళ తర్వాత మొత్తానికే స్కెచ్ వేసింది. 2022 నుంచి భూ పందేరానికి శ్రీకారం చుట్టింది. మందస్తు ప్రణాళికలో భాగంగా కూకట్‌పల్లి గ్రామ సర్వేనెంబరు 627, 629, 1011/1, 2, 3, 12లలో గల 252. 36 ఎకరాల భూమిని కూకట్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో 2022 మే 27న సేల్‌డీడ్ నెం.4552/2022 కింద తమ రియల్ ఎస్టేట్ సంస్థ అయిన హిందూజా ఎస్టేట్ ప్రై.లిమిటెడ్‌కు బదిలీ చేసింది. భారీ ఆకాశహార్మాలు, విల్లాలు, కమర్షియల్ టవర్స్ అభివృద్ధి చేయడంలో భాగంగా రూపొందించిన లే అవుట్‌ను ప్రభుత్వంతో అప్రూవ్ చేయించి బడా నిర్మాణ సంస్థలకు కట్టబెడుతూ వస్తొంది. ఇంట్లో కి రమ్మంటే ఇల్లాంతా నాదే అన్నట్లుగా మొదట వంద ఎకరాలను మాత్రమే పారిశ్రామికేతర అవసరాలను సృష్టిస్తామని ఉత్తర్వులు పొందిన సంస్థ 10 ఏళ్ళ తరువాత అసలుకే ఎసరు పెట్టింది.

ప్రభు త్వం రైతుల నుంచి సేకరించిన 151. 08 ఎకరాలతోపాటు 181. 04 ఎకరాల ప్రభుత్వ భూమిలో సగానికి పైగా తమ రియల్ ఎస్టేట్ సంస్థకు బదిలీ చేసి లే అవుట్ రూపొందించడం ఇక్కడ గమనించాల్సిన అంశం. పక్కా ప్రణాళికతో రూపొందించిన లే అవుట్‌కు 2022లో రాజముద్రను వేయించుకుని కాసుల పంట పండించుకుంటుంది. కూకట్‌పల్లి నుంచి హైటెక్ సిటీకి వెళ్ళే రహదారి కావ డం, 2008-/2015 మధ్య కాలంలోనే కంపెనీ భూముల మధ్యగుం డా ఈ రోడ్డును నాలుగు వరసుల రహదారిగా అభివృద్ధి చేయించుకోవడంలో సఫలీకృతులైనా సంస్థ వందల ఎకరాలను అత్యంత విలువైన, వ్యాపార యోగ్యమైన భూమిని మలుచుకోగలిగింది. నా లుగు వరుసల రహదారి అది కూడా కూకట్‌పల్లి హైటెక్ సిటీని కలి పే రోడ్డు కావడంతో అత్యంత కమర్షియల్ ప్రాంతంగా తయారైం ది. ఈ భూముల్లో కాసుల సేద్యం చేయాలని ఎప్పటి నుంచో ఉవ్విళ్ళూరుతున్న బడా నిర్మాణ సంస్థలు లే అవుట్ చేసిందే తడువు అన్నట్లుగా ఎకరానికి వందకోట్లకు పైగా పెట్టేందుకు కూడా వెనుకాడలేదంటే భూములు ఎంతటి విలువైనవో చెప్పనవసరం లేదు. హిం దూజా ఎస్టేట్ ప్రైవేటు లిమిటెడ్ ప్రస్తుతం 164.05 ఎకరాలను 14 భాగాలుగా చేసిన లే అవుట్ రూపొందించి బడా నిర్మాణ సంస్థలకు అప్పగించేసింది. హైరెజ్డ్ బిల్డింగ్స్, విల్లాలు, కమర్షియల్ టవర్స్ నిర్మించదలచి సంస్థలు కొన్ని 10ఎకరాలు, కొన్ని 20ఎకరాల చొ ప్పున కొనుగోలు చేశాయి. మరికొన్ని సంస్థలు 15 నుంచి 5 ఎకరాల వరకు ప్లాట్లను పొంది భవన నిర్మాణాలను ప్రారంభించాయి.

జోరుగా ఆకాశహార్మాలు.. విల్లాలు.. కమర్షియల్ టవర్లు
హిందూజా ఎస్టేట్ సంస్థ లే అవుట్ భూమిని ప్లాట్లు గా విభజించిందే ఆలస్యమన్నట్లుగా ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా కొనుగోలు చేసిన బడా నిర్మాణ సంస్థలు జోరుగా పనులను ప్రారంభించాయి. సుమా రు 30 ఎకరాల్లో ఇప్పటికే విల్లాల నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. ఒక్కో విల్లా ధర 10 నుంచి 14కోట్లకు పైగా పలుకుతున్నాయి. మరోవైపు హానర్, సాస్ ఇన్ ఫ్రా, ఫినిక్స్, కాండియో ,రెయిన్‌బో విస్టా వంటి బడా సంస్థలు 20 నుంచి 25 అంతస్తులు కలిగిన 13 టవర్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టాయి. మరోవైపు నాలు గు వరుసల రహదారి పక్కన భారీ ఐటి టవర్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలకు మరికొన్ని సంస్థలు శ్రీకారం చుట్టాయి. కాకులను కొట్టి గద్దలకు వేసిన తీ రుగా చిన్న, సన్న కారు రైతుల కడుపుకొట్టి లాక్కున్న భూముల్లో వేల కోట్ల విలువైన టవర్ల నిర్మాణాలు చేపడుతూ కార్పొరేట్ సంస్థలు, రియల్టర్లకు కనకవర్షం కురిపిస్తొంది. నాడు కంపెనీ పేరుతో బడుగు రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న పచ్చటి పంటలు పండే భూ ముల్లో హిందూజా లాంటి కార్పొరేట్, నిర్మాణ రంగ సంస్థలకు కనకవర్షం కురిపించేలా నడిచిన వ్యవహారంపై తెరవెనుక భారీ త తంగమే నడిచి ఉంటుందన్న అనుమానాలు బలంగా ఉన్నా యి.

ఉద్యోగ,ఉపాధి కల్పనతో ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని ప్రొత్సహించడం జరుగుతుంది. ఇందుకోసం ప్రభుత్వ భూములతోపాటు పొ లాలను లాక్కుని మరీ పరిశ్రమకులకు అప్పగిస్తే కంపెనీల ముసుగులోని పారిశ్రామికవేత్తలు అసలు ఉద్దేశ్యా న్ని నీరుగార్చుతున్నారని ఐడీఎల్ కంపెనీ భూముల్లో సాగుతున్న రియల్ దందాను బట్టి స్పష్టమవుతోంది. కొంతమంది కక్కుర్తి నాయకుల అండదండలతో కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని నీరుగార్చుతున్నాయని జ నం మండిపడుతున్నారు. చట్టంలో ఉన్న లొసుగులను, ప్రజాప్రతినిధులు, అధికార వ్యవస్థ బలహీనతలను ఆసరాగా ఈ వ్యవహరం సాగుతూనే ఉంటుందని సామాజిక నిపుణుడొకరు వ్యాఖ్యానించా రు. పరిశ్రమ నడపలేని పరిస్థితి ఉన్నా… ప్రమాదకరమైన పరిస్థితు లు ఉత్పన్నమైనా ప్రభుత్వం భూమిని వెనక్కి తీసుకొని ఇతర ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించాలన్న నిబంధనలను తుంగలో తొక్కి జరుగుతున్న వేల కోట్ల విలవైన భూ దందాపై ప్రభుత్వం పునః పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News