Wednesday, January 22, 2025

బంగ్లాదేశ్‌లో హిందువుల భారీ ర్యాలీ

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్‌లో మైనార్టీల హక్కుల పరిరక్షణ కోరుతూ వేలాది మంది హిందువులు శనివారం భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. చటోగ్రామ్‌లో సనాతన జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. మహ్మద్‌యూనస్ సారథ్యం లోని తాత్కాలిక ప్రభుత్వం ముందు ఎనిమిది డిమాండ్లు ఉంచారు. వాటిని నెరవేర్చేవరకు వీధుల్లో తమ నిరసన కొనసాగుతుందని కొందరు హిందూ ఉద్యమకారులు పేర్కొన్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొద్ది నెలల క్రితం బంగ్లాలో హింసాత్మక సంఘర్షణలు జరగడంతో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలి తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ తాత్కాలిక ప్రభుత్వానికి యూనస్ నేతృత్వం వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News