- Advertisement -
ముంబయి : బిర్లా కంపెనికి చెందిన హిందుస్థాన్ మోటార్స్ తాజాగా ఎలక్ట్రిక్ టూ వీలర్ల రంగంలోకి ప్రవేశించింది. వచ్చే ఏడాది నుంచి ఈ కంపెనీకి చెందిన ఈవీలు మార్కెట్లోకి ప్రవేశించనున్నాయి. చెందిన సంస్థతో కలిసి మోటార్స్ కంపెనీ ఏర్పాటు చేసింది. పశ్చిమబెంగాల్లోని ఉత్తరపర ప్లాంటును ఆధునీకరించి ద్విచక్ర వాహనాలను ఉత్ప త్తి చేయనున్నారు. ఈవీల కోసం తొలుత రూ.600 కోట్లు వెచ్చించనున్నారు. పైలట్ రన్‌కు ఆరు నెలల సమయం పట్టనుందని మోటార్స్ తెలిపింది. అదేవిధంగా ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ల విభాగంలోకి తమ కంపెనీ అడుగుపెట్టనుందని ప్రతినిధులు తెలిపారు. కాగా అంబాసిడర్ కార్ల తయారీ నిలిచిపోవడంతో ప్లాంటు 314 ఎకరాల స్థలం ఇతర అవసరాలకు వినియోగించుకునేందుఉ బెంగాల్ ప్రభుత్వం అనుమతించింది.
- Advertisement -