Tuesday, November 26, 2024

‘హిందుస్థాన్ సిరంజీస్’ మూసివేత

- Advertisement -
- Advertisement -

Hindustan Syringes shuts plant due to pollution

దేశంలో సూదులకు కొరత ఏర్పడే ప్రమాదం

ఫరీదాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉన్న తమ కంపెనీని మూసి వేసినట్లు ‘హిందుస్థాన్ సిరంజీస్ అండ్ మెడికల్ డివైజెస్’(హెచ్‌ఎండి) వెల్లడించింది. అయితే దీనివల్ల దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్‌తో పాటుగా ఇతర చికిత్సా కార్యక్రమాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని కంపెనీ ఎండి రాజీవ్ నాథ్ తెలిపారు. హెచ్‌ఎండిలో రోజుకు 1.5 కోట్ల సూదులు,80 లక్షల సిరంజీలు ఉత్పత్తి చేస్తున్నట్లు రాజీవ్‌నాథ్ పేర్కొన్నారు. ఇప్పుడు ఫ్యాక్టరీ మూతపడ్డంవల్ల రోజుకు కనీసం 1.2 కోట్ల సూదుల కొరత ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే భారత్ సహా పలు దేశాల్లో సిరంజీలకు కొరత ఉందన్నారు.ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఎగుమతులపై నిషేధం కూడా విధించిందన్నారు.

దేశవ్యాప్తంగా కొవిడ్ నివారణ, టీకా కార్యక్రమాల్లో ఉపయోగించే సిరంజీల్లో 66 శాతం హెచ్‌ఎండినే అందిస్తోందని ఆయన చెప్పారు. ఫ్యాక్టరీ మూత వల్ల ఈ కార్యక్రమాలో ్లజాప్యం జరిగే ప్రమాదం ఉందన్నారు. అలాగే ధరలు పెరగవచ్చన్నారు. ఈ విషయంపై ప్రధాని మోడీకి లేఖ రాసినట్లు రాజీవ్ నాథ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద సిరంజీలను తయారు చేసే కేంద్రాలను జాతీయ ప్రాధాన్యంగల వస్తువులను ఉత్పత్తి చేసే కేంద్రాలుగా గుర్తించాలని లేఖలో విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ కూడా ఇదే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లి ఈ రంగానికి మినహాయింపు ఇవ్వాలని కోరినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News