Sunday, January 26, 2025

స్విగ్గీ హోలీ యాడ్‌పై హిందూత్వవాదుల ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: హోలీ పండుగను పురస్కరించుకుని ఫుడ్ డెలివరరీ యాప్ స్విగ్గీ రూపొందించిన ఒక వ్యాపార ప్రకటన వివాదాస్పమైంది. హిందూత్వవాదులు, సంఘ్ పరివార్ కార్యకర్తలు, బిజెపి నాయకుల నుంచి స్విగ్గీ తీవ్ర స్థాయిలో విమర్శలనెదుర్కోవలసి వచ్చింది. ట్విటర్ వేదికగా స్విగ్గీపై మాటల యుద్ధం కొనసాగింది. హోలీ పండుగ సందర్భంగా ఆన్‌లైన్ గ్రాసరీ స్టోర్ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ రూపొందించిన ఒక ప్రకటన ఇలా ఉంది..రెండు కోడిగుడ్ల కింద ఇలా ఉంది: ఆమ్‌లెట్, సన్నీ సైడ్ అప్, కిసీ కే సర్ పర్..ఈ మూడు కొటేషన్లలో పై రెండింటికీ ఓకే అని రైట్ మార్క్ వేసి మూడోదానికి మాత్రం వద్దు నఅ్న సూచనగా ఇంటూ మార్కు వేసి ఉంది. అటే కోడి గుడ్డును తలపైన కొట్టుకోవద్దు అన్న అర్థంతో రాసి ఉంది.

చివరగా బురామత్‌ఖేలో( తప్పుగా ఆడవద్దు), గెట్ హోలీ ఎసెన్షియల్ ఆన్ ఇన్‌స్టామార్ట్ అని హ్యాష్‌ట్యాగ్ ఉంది. ఈ బిల్‌బోర్డుపై హిందూత్వవాదులు మండిపడుతున్నారు. హిందువుల పండుగను అవమానించవద్దు అంటూ స్విగ్గీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందువేతర పండుగలకు ఇలాంటి ప్రకటనలు పెట్టగలరా అని ప్రశ్నిస్తూ హిందూ సమాజానికి స్విగ్గీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆర్‌ఎస్‌ఎస్, విశ్వ హిందూ పరిషద్ నాయకురాలు ప్రాచి సాధ్వి ట్విటర్ వేదికగా స్పందిస్తూ అన్ని మతాల వారికి ఆహారాన్ని సరఫరా చేసే స్విగ్గీ అన్ని మతాలను గౌరవించాలని పేర్కొన్నారు. ఈ హోలీ యాడ్స్‌ను తొలగించాలని ఆమె కోరారు. హిందూఫోబిక్‌స్విగ్గీ హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండింగ్ అవుతున్న స్విగ్గీ వ్యతిరేక ట్వీట్లతో బిజెపి నాయకుడు అరుణ్ యాదవ్ సైతం గొంతు కలిపారు. వివాదాస్పద బిల్‌బోర్డులతో స్విగ్గీ లక్షలాదిమంది హిందువుల మనోభావాలను గాయపరిచిందని, తక్షణమే ఈ ప్రకటనను ఉపసంహరించుకుని హిందూ సమాజానికి స్విగ్గీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News