Tuesday, November 5, 2024

ఈజీ క్లీన్‌ కౌంటర్‌ టాప్‌ బేసిన్‌, షవర్‌ ఎన్‌క్లోజర్స్‌ను పరిచయం చేసిన హింద్‌వేర్‌..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పూర్తి స్థాయి బాత్‌రూమ్‌ సొల్యూషన్స్‌లో అగ్రగామిగా వెలుగొందుతున్న హింద్‌వేర్‌ బుధవారం తమ ఉత్పత్తి శ్రేణిని మరో 12 నూతన ఉత్పత్తుల జోడింపుతో విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. ఈ కంపెనీ నూతన శ్రేణి కౌంటర్‌టాప్‌ బేసిన్‌– ఈజీ క్లీన్‌ను విడుదల చేసింది. ఇది విప్లవాత్మక సాంకేతికతను కలిగి ఉండటంతో పాటుగా పరిశుభ్రత, తాజాదనం కోసం ఆటోమేషన్‌కు ఉదాహరణగా నిలుస్తుంది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ కంపెనీ నూతన విభాగం, బాత్‌వేర్‌లో తమ ప్రవేశాన్ని వెల్లడిస్తూనే షవర్‌ ఎన్‌ క్లోజర్‌ను హింద్‌వేర్‌ ఇటాలియన్‌ కలెక్షన్‌ ఆవిష్కరించింది. మెట్రోలు, మినీ మెట్రోల వినియోగదారులను లక్ష్యంగా చేసుకోవడంతో పాటుగా సమగ్రమైన పరిష్కారాలతో వినియోగదారుల సౌకర్యం వృద్ధి చేయడం లక్ష్యంగా చేసుకుంది. హింద్‌వేర్‌ యొక్క నూతన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో, గృహ, ఆతిధ్య, వాణిజ్య ప్రాంగణాలలో బాత్‌రూమ్‌లకు సరికొత్త అందాన్ని తీసుకురానున్నాయి.

గత కొద్ది నెలలుగా ఈ కంపెనీ ట్రెండీ మరియు తాజా వెర్షన్‌ను హింద్‌వేర్‌ 2.0గా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అనుగుణంగా ఈ బ్రాండ్‌ ఇప్పుడు హింద్‌వేర్‌, హింద్‌వేర్‌ ఇటాలియన్‌ కలెక్షన్‌ కోసం విడుదల చేయడంతో పాటుగా ఆవిష్కరణ, సస్టెయినబిలిటీ కోసం వాగ్ధానం చేస్తుంది. హింద్‌వేర్‌కు విస్తృతశ్రేణిలో వినూత్నమైన ఉత్పత్తులు ఉన్నాయి. వాటిలో టచ్‌ ఫ్రీ, ట్యాంక్‌లెస్‌ వాటర్‌ క్లోసెట్స్‌, ఇప్పుడు ఈజీ క్లీన్‌ కౌంటర్‌ టాప్‌ బేసిన్స్‌ ఉన్నాయి. ఇవన్నీ కూడా వినూత్నంగా ఉంటాయి. అంతేకాదు, పర్యావరణం పట్ల హింద్‌వేర్‌ నిలకడ ప్రయత్నాలను కొనసాగిస్తుంది. దీని నీటి ఆదా ఉత్పత్తులు గ్రీన్‌ లేదా సస్టెయినబల్‌ బిల్డింగ్స్‌కు అత్యంత అనుకూలంగా ఉంటాయి. ప్రకృతి వనరులను అత్యంత సమర్థవంతంగా వినియోగించుకుంటుంటాయి. ఆలోచనాత్మకమే అందం అనే బ్రాండ్‌ యొక్క సిద్ధాంతానికి అనుగుణంగా ఈజీ క్లీన్‌ బేసిన్స్‌ మరియు షవర్‌ ఎన్‌క్లోజర్స్‌ను రూపొందిచారు. ఇవి వినూత్నమైన పనితీరు ఆధారిత పరిష్కారాలపై దృష్టి సారించడంతో పాటుగా అత్యుత్తమ భద్రత, పరిశుభ్రతను ఇంటిలో అందిస్తాయి.

ఈ ఉత్పత్తి సిరీస్‌ ఆవిష్కరణ గురించి హింద్‌వేర్‌ లిమిటెడ్‌ బాత్‌ అండ్‌ టైల్‌ బిజినెస్‌,చీాఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శ్రీ సుధాంశు పోఖ్రియాల్‌ మాట్లాడుతూ ‘‘హింద్‌వేర్‌ వద్ద మా ఉత్పత్తులకు చక్కటి ఆదరణ లభిస్తుండటాన్ని చూస్తున్నాము. వినియోగదారులు, పంపిణీ దారులతో మా నిరంతర చర్చల అనంతరం ఇప్పుడు మేము మా ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను విస్తరించడం ద్వారా మరిన్ని వైవిధ్య అవసరాలను అందించగలుగుతున్నాము. పరిశ్రమ నాయకునిగా, ఆటోమేషన్‌కు డిమాండ్‌ పెరుగుతుండటం చూడటంతో పాటుగా పరిశుభ్రతపై దృష్టి పెరగడం కూడా గమనించాము. దానికనుగుణంగానే మాఉత్పత్తి విస్తరణ కూడా ఉంటుంది. అదనంగా, సంక్షేమం పట్ల పెరుగుతున్న వినియోగదారుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని మేము నూతన ఈజీ క్లీన్‌ బేసిన్‌ను డిజైన్‌, పనితనం, సాంకేతికతల ఖచ్చితమైన సమ్మేళనంగా తీర్చిదిద్దడంతో పాటుగా పరిశుభ్రత, భద్రతను సాధ్యం చేస్తుంది’’ అని అన్నారు.

ఆయనే మాట్లాడుతూ ‘‘ఇప్పుడు బాత్‌రూమ్‌లంటే కేవలం ప్రకృతి అవసరాలను తీర్చుకోవడానికి మాత్రమే కాదు, షవర్‌ ఎన్‌క్లోజర్లలో మేము ప్రవేశించడం ద్వారా వినియోగదారుల బాత్‌ అవసరాలన్నీ మేము ఒకే చోట తీర్చగలుగుతున్నాము. ఈ నూతన షవర్‌ ఎన్‌క్లోజర్‌లు విస్తృత శ్రేణి శైలి, వైవిధ్యమైన డిజైన్స్‌తో లభిస్తాయి. తమ బాత్‌రూమ్‌ ప్రాంగణాలలో ఆధునిక ఫిట్టింగ్స్‌ కావాలనుకునే వారు ఎవరికైనా ఇవి తగినట్లుగా ఉంటాయి’’అని అన్నారు.

హింద్‌వేర్‌ లిమిటెడ్‌ మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చారు మల్హొత్రా భాటియా మాట్లాడుతూ ‘‘ హింద్‌వేర్‌ ఓ ప్రతిష్టాత్మకమైన బ్రాండ్‌. వైవిధ్యమైన ధరల వద్ద సృజనాత్మక ఉత్పత్తులు కోరుకునే వినియోగదారుల నడుమ ఈ బ్రాండ్‌ ప్రతిధ్వనిస్తుంది. ఓ బ్రాండ్‌గా మేము కేవలం డిజైన్‌, సౌందర్యంపై మాత్రమే దృష్టి సారించడం కాకుండా ఆవిష్కరణ, సాంకేతికతలపై కూడా దృష్టి సారిస్తుంటాము. ఆధునిక భారతీయ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఇంటిగ్రేటెడ్‌ ప్రచారం ప్రారంభించనున్నాము’’ అని అన్నారు.

హింద్‌వేర్‌ ఇటాలియన్‌ కలెక్షన్‌ నుంచి ఈజీ క్లీన్‌ కౌంటర్‌టాప్‌ బేసిన్స్‌

ఈ నూతన ఈజీ క్లీన్‌ కలెక్షన్‌ లో అత్యద్భుతంగా తీర్చిదిద్దిన కౌంటర్‌ టాప్‌ బేసిన్స్‌ ఉంటాయి. ఇవి కంపాక్ట్‌ మరియు పనితీరు శైలిని అందిస్తాయి. పేరుకు తగినట్లుగానే ఈజీక్లీన్‌ బేసిన్స్‌ బై హింద్‌వేర్‌ ఇటాలియన్‌ కలెక్షన్‌, వినియోగించిన ప్రతిసారీ ఆటోమేటిక్‌గా క్లీన్‌ చేసుకుంటుంది. వాష్‌ బేసిన్‌ ఫ్లషింగ్‌ చేయడం వల్ల బాత్‌రూమ్‌ క్లీన్‌గా ఉంటుంది.

షవర్‌ ఎన్‌క్లోజర్స్‌ బై హింద్‌వేర్‌ ఇటాలియన్‌ కలెక్షన్‌

షవర్‌ ఎన్‌క్లోజర్స్‌తో వినియోగదారులకు వినూత్న అనుభవాలను అందిస్తుంది. ఈ కంపెనీ 50కు పైగా ఎస్‌కెయులను ఈ నూతన షవర్‌ ఎన్‌క్లోజర్స్‌ కోసం కలిగి ఉంది. ఇవి నీటిని ఒక ప్రాంతానికిమాత్రమే పరిమితం చేయడంతో పాటుగా మిగిలిన ప్రాంతాన్ని పొడిగా ఉంచుతాయి. తద్వారా బాత్‌రూమ్‌ను పరిశుభ్రంగా, బ్యాక్టీరియా రహితంగానూ మారుస్తుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News