Friday, November 15, 2024

96 ఏళ్ల వృద్ధుడికి తుంటి ఎముక సర్జరీ

- Advertisement -
- Advertisement -

జమ్మూ: జమ్మూలోని 166 మిలిటరీ ఆసుపత్రి ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తుంటి ఎముక(నెక్ ఆఫ్ ఫెమర్ ఫ్రాక్చర్) విరిగిన ఒక 98 ఏళ్ల వృద్ధుడైన మాజీ సైనికాధికారికి ఆసుపత్రిలోని వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించారు. ఇతర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న ఆ వృద్ధుడికి ఫిబ్రవరి 10న తుంటి ఎముక విరిగింది. ఆయనకు బ్లడ్ క్యాన్సర్‌కు దారితీసే బోన్ మారో వ్యాధి ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు శనివారం తెలిపారు.

అయితే ఆయనకు నొప్పి నుంచి ఉపశమన, నడక రావాలంటే తుంటి ఎముకకు సర్జరీ చేయడమే పరిష్కారమని వైద్యులు భావించడంతో ఫిబ్రవరి 12న ఆయనకు తుంటి ఎముక సర్జరీ జరిగిందని ఆయన చెప్పారు. మరుసటి రోజే వాకర్‌పై నడిచిన ఆ వృద్ధుడు మూడవ రోజు మిలిటరీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని ఆయన తెలిపారు. 96 ఏళ్ల వృద్ధుడికి తుంటి ఎముక సర్జరీని విజయవంతంగా నిర్వహించినందుకు 166 మిలిటరీ ఆసుపత్రి వైద్యులను ఆయన అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News