Wednesday, January 22, 2025

2024లో కొత్త ఉద్యోగాల జోరు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కొత్త సంవత్సరం(2024)లో ఉద్యోగాలు 8.3 శాతం పెరగనున్నాయని నివేదిక పేర్కొంది. అంటే ఉద్యోగాలు మారాలని లేదా కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి కొత్త ఏడాది అనుకూలంగా ఉండనుంది. 2023 డిసెంబర్‌లో నియామకాల్లో 2 శాతం పెరుగుదల ఉంది, అయితే 2024లో నియామకాల్లో 8.3 శాతం వృద్ధి ఉండవచ్చని అంచనా. ఫౌండ్‌ఇట్ యానువల్ ట్రెండ్స్ నివేదిక ప్రకారం, 2024లో మొత్తం నియామకాలలో 8.3 శాతం పెరుగుదల ఉండవచ్చు. ఈ నియామకాల్లో బెంగళూరు నగరం అత్యధికంగా 11 శాతం వృద్ధి అంచనాను కల్గివుంది. నివేదిక ప్రకారం, ఈ సంవత్సరంలో గరిష్ట నియామకాలు తయారీ, బిఎఫ్‌ఎస్‌ఇ, ఆటోమోటివ్, రిటైల్, ట్రావెల్ టూరిజం రంగాలలో ఉండనున్నాయి. ఫౌండ్‌ఇట్ ఇన్‌సైడ్ ట్రాకర్ (ఎఫ్‌ఐటి) డేటా ప్రకారం, నియామక కార్యకలాపాల కోణంలో 2023 మంచి సంవత్సరం కాదు.

2022 కంటే 2023లో నియామక కార్యకలాపాలు 5 శాతం తక్కువగా ఉన్నాయి. సంవత్సరం చివరి నెలలో నియామక సూచికలో 2 శాతం వృద్ధి కనిపించింది. అయితే 2024లో వేగవంతమైన నియామక కార్యకలాపాలు కనిపించవచ్చు. 2022 మధ్యకాలంలో ఉన్న ట్రెండ్‌ను అధిగమించి, 2023 చివరి నాటికి ఆర్థిక వ్యవస్థ ఒక మలుపు తిరిగిందని నివేదిక పేర్కొంది. జాబ్ మార్కెట్ పరివర్తన దశలోకి ప్రవేశించింది, ఇక్కడ అట్రిషన్, హైరింగ్ రేట్లు రెండూ నిలకడగా మారాయి. నివేదిక ప్రకారం, తక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ ఉద్యోగాల సృష్టి, నియామకాల మధ్య అసమతుల్యత సరైన ప్రతిభను కనుగొనడంలో కంపెనీలకు కొనసాగుతున్న ఇబ్బందులను ప్రతిబింబిస్తుంది.

2023లో కొన్ని రంగాలు చెప్పుకోదగ్గ బలాన్ని, వృద్ధిని కనబరిచాయని, సవాళ్లతో కూడిన వాతావరణంలో ఇది విజయవంతమైంది. సముద్ర, షిప్పింగ్ పరిశ్రమలో నియామకాలలో 28 శాతం పెరుగుదల కనిపించింది. రిటైల్, ట్రావెల్, టూరిజం 25 శాతం వృద్ధిని సాధించింది. ప్రకటనలు, మార్కెట్ వనరులు, పబ్లిక్ రిలేషన్స్ రంగాలు 18 శాతం పెరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News