Monday, January 20, 2025

అమెజాన్ క్లౌడ్ యూనిట్‌లో కొత్త ఉద్యోగుల నియామకం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రపంచ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ పదివేల మందిని తొలగించనున్నట్లు ప్రకటించి కలకలం రేపింది. అయితే తాజాగా కొత్తగా ఉద్యోగుల నియామకం చేపట్టనుందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. అమెజాన్ తన క్లౌడ్ యూనిట్ కోసం కొత్త ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తుంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ విభాగంలో కొత్తగా ఉద్యోగులను నియమించుకోనున్నట్లు అమెజాన్ వెబ్‌సర్వీసెస్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మాట్ కార్మాన్ బ్లూమ్‌బర్గ్‌తో తెలిపారు. వచ్చే ఏడాది ఉద్యోగుల నియామక ప్రక్రియ విస్తృతం చేస్తామని అమెజాన్ ప్రతినిధి తెలిపింది. అమెజాన్ ఇతర రంగాల్లో తొలగింపు కొనసాగినా వెబ్‌సేవల్లో నియామకాలు కొనసాగుతాయని కంపెనీ పేర్కొంది. కంపెనీ వృద్ధి చెందుతున్నా మాంద్యం ప్రభావం పడుతుందని అమెజాన్ అంచానా వేస్తుంది. అయితే భవిష్యత్తు వృద్ధి కోసం క్లౌడ్‌పై దృష్టి సారిస్తుంది.

కాగా అమెజాన్ క్లౌడ్ యూనిట్ మూడో త్రైమాసికంలో మొత్తం ఝూ0.5 బిలియన్ డాలర్ల విక్రయాలను నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల నియామక ప్రక్రియ వచ్చే ఏడాది ఆరంభం కానుంది. ఈ పరిణామాన్ని పరిశీలిస్తే కామర్స్ దిగ్గజం ఉద్యోగుల నియామకాన్ని పూర్తిగా నిలిపివేయలేదని తెలుస్తోంది. కొన్నిరోజుల క్రితం అమెజాన్ కొన్ని విభాగాలను భారత్‌లో మూసివేయనున్నట్లు తెలిపింది. ఫుడ్ ఆర్డర్లను ఈ నెలాఖరు నుంచి నిలిపివేస్తున్నట్లు అమెజాన్ ఇప్పటికే ప్రకటించింది. కాగాప్రపంచంలో చాలాప్రాంతాల్లో అమెజాన్ వ్యాపారం మందగించడంతో ఖర్చులను తగ్గించడం, ఉద్యోగులను తొలగించడం తదితర చర్యలు తీసుకుంటున్నట్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆండీ జెస్సీ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News