Monday, December 23, 2024

కాంగ్రెస్‌లో చేరిన బిజెపి ఎంపి

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల వేళ హర్యానాలోని హిసార్ బిజెపి ఎంపి బ్రిజేంద్ర సింగ్ పార్టీకి రాజీనామా చేశారు. తాను బిజెపి ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. బిజెపికి రాజీనామా చేసిన తరువాత ఆయన నేరుగా కాంగ్రెస్ అధ్యక్షులుమల్లిఖార్జున ఖర్గే నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. ఆయనకు పార్టీ కండువా కప్పి ఖర్గే బిజెపిలోకి ఆహ్వానించారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రైతుల ఆందోళన, రెజర్ల నిరసనలు వంటి వాటిపై కేంద్రంలోని అధికార బిజెపి స్పందన సరిగ్గాలేదని పేర్కొంటూ సింగ్ బిజెపిని వీడారు. ఇటీవలి కాలంలో ఓ బిజెపి ఎంపి కాంగ్రెస్‌లో చేరడం ఇదే తొలిసారి అయింది.

పలు కీలక విషయాలపై తాను చాలా కాలంగా బిజెపి అధినాయకత్వ వైఖరితో విసిగిపోయినట్లు, అగ్నివీర్ వంటి విషయాలలో కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు బ్రిజేందర్ తెలిపారు. వారి స్పందన సరిగ్గా లేకపోవడంతో పార్టీకి రాజీనామా చేసినట్లు వివరించారు. కాంగ్రెస్ కుటుంబంలో చేరుతున్నందుకు తనకు సంతోషంగా ఉందన్నారు. తాను అంతకు ముందు ఐఎఎస్ ఉద్యోగంల ఉండేవాడినని, హిసార్ ప్రజల కోసం పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చానని, ఇకపై కూడా రాజకీయాల ద్వారా ప్రజాసేవ సాగిస్తామని, అయితే ఇప్పుడు తన దారి రాదారి అయిందని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News