Saturday, November 23, 2024

నాటి రాజ్యాంగ ధర్మాసనానికి అయోధ్య ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

అయోధ్య: రామ జన్మభూమి కేసులో నాలుగేళ్ల క్రితం చారిత్రాత్మక తీర్పును వెలువరించిన రాజ్యాంగ ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తులకు జనవరి 22న జరగనున్న అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్టాపన మహోత్సవానికి అతిథులుగా ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. రామ జన్మభూమి కేసులో తీర్పు వెలువరించిన రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యులుగా మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బాబ్డే,

ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఎస్ అబ్దుల్ నజీర్ ఉన్నారు. వివాదాస్పద స్థలంలో రామాలయ నిర్మాణానికి అనుకూలంగా 2019లో వీరు తీర్పు ఇచ్చారు. ఆయోధ్య ఆలయ ఆహ్వానితుల జాబితాలో 50 మందికిపైగా న్యాయకోవిదులు ఉన్నారు. వీరిలో మాజీ ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు, ప్రముఖ న్యాయవాదులు, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, మాజీ అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News