Sunday, January 19, 2025

ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేయడం చారిత్రాత్మక నిర్ణయం

- Advertisement -
- Advertisement -

43 వేల మంది కార్మికులకు ఇదొక శుభవార్త
రాష్ట్ర శాసన సభాపతిని కలిసి సన్మానించిన ఆర్టీసి ఉద్యోగులు, సిబ్బంది

మన తెలంగాణ/బాన్సువాడ: తెలంగాణ ప్రభుత్వం ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేయడం చారిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం స్పీకర్‌ను ఆర్టీసి ఉద్యోగులు, సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా స్పీకర్ మాట్లాడుతూ 50 ఏండ్ల కల నెరవేరిందని, ఇప్పుడు కార్మికులు కాదు ప్రభుత్వ ఉద్యోగులని, అందరికి హృదయ పూర్వక శుభాకాంక్షలన్నారు. క్యాబినెట్ నిర్ణయం తదుపరి అసెంబ్లీలో బిల్ పాస్ అయిందని, త్వరలోనే ఇది చట్టంగా మారుతుందన్నారు.

Also Read: రైతులకు అండగా మంత్రి నిరంజన్‌రెడ్డి

సంస్థ ఉద్యోగులు ప్రయాణీకులకు మెరుగైన సేవలను, ప్రభుత్వానికి, రాష్ట్రానికి మంచిపేరు తీసుకరావాలని కోరుతున్నామన్నారు. సంస్థ ఉద్యోగులు ప్రయాణీకులకు మెరుగైన సేవలను, ప్రభుత్వానికి, రాష్ట్రానికి మంచిపేరు తేవాలని కోరుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర పరిపాలన దేశానికి ఆదర్శమన్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశామని, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో కేసిఆర్‌ను మించిన వారు ఎవ్వరూ లేరన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినా సీఎం కేసిఆర్ సమర్థవంతంగా నడిపిస్తున్నారన్నారు.

తెలంగాణ పథకాలు తమ రాష్ట్రాలలో ఎందుకు లేవని ఇతర రాష్ట్రాల ప్రజలు అడుగుతున్నారన్నారు. ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందాలనే నిర్ణయం సీఎం కేసిఆర్‌దేనన్నారు. మణిపూర్, హర్యానా రాష్ట్రాలలో జరిగిన సంఘటనలు దేశానికి మంచిది కాదని, ఎల్లప్పుడు మంచితనం ముఖ్యమన్నారు. గత ఐదేళ్లలో బాన్సువాడ నియోజకవర్గానికి పుష్కలంగా నిధులు వచ్చాయని, నియోజకవర్గ ప్రజల తరపున సిఎం కెసిఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ జుబేర్, నాయకులు మహ్మద్ ఎజాజ్, ఆర్టీసి ఉద్యోగులు, సిబ్బంది తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News