Sunday, December 22, 2024

కెసిఆర్ పాలనలో చారిత్రాత్మక ప్రగతి

- Advertisement -
- Advertisement -

పల్లెల అభివృద్ధికి రూ. కోట్లాది నిధులు వెచ్చింపు
బాల్కొండ సెగ్మెంట్లో అభివృద్ధి పనులకు
శంకుస్థాపనలు
మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వెల్లడి

Historic progress KCR rule

మన తెలంగాణ/నిజామాబాద్ బ్యూరో : ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం చారిత్రాత్మక ప్రగతిని సంతరించుకుంటోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, రాష్ట్ర చరిత్రలోనే ఇదివరకెన్నడూ జరగలేదని అన్నారు. బాల్కొండ అసెంబ్లీ నియోజక వర్గంలో కోట్లాది రూపాయల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులకు మం త్రి ప్రశాంత్‌రెడ్డి మంగళవారం శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశా రు. జలాల్పూర్ నుండి నాగపూర్ ఎక్స్ రోడ్డు వరకు రూ. 60 లక్షలతో బిటి రోడ్డుపునరుద్దరణ పనులకు, నూతనంగా మంజూరైన ఎస్సీ క మ్యూనిటీ హాల్స్ అదనపు గదుల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు.

అదేవిధంగా భీంగల్, గోన్‌గొప్పుల రహదారి బోగరపు వాగుపై రూ. 2.60 కోట్లతో నూతనంగా నిర్మించిన హైలెవల్ బ్రిడ్జి ప్రారంభించారు. భీంగల్ బెజ్జోరా రహదారి జక్కలత్ ఒర్రెపై రూ. 2.35 కోట్లతో నూతనంగా నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. భీంగల్ కమ్మర్‌పల్లి రహదారి పై మెండోరా వద్ద రూ. 1.66 కోట్లతో నూతనంగా నిర్మించిన వంతెనను ప్రారంభించారు. ప్రతిచోట ప్రజలు డప్పు వాయిద్యాలు, బోనాలు, మంగళహారతులతో మంత్రికి ఘన స్వా గతం పలికారు. ఈసందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ పల్లెల ప్రగతికి తమ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యతనిస్తూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగిస్తోందని తెలిపారు.

ఇంకనూ చేపట్టాల్సిన పనులు మిగిలి ఉన్నందున వాటి నిర్మాణాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించి ప్రతి గ్రామంలో నిరంతరం గా అభివృద్ధి పనులు జరిపిస్తున్నామని అన్నారు. వానాకాలంలో కురిసిన ఏకధాటి వర్షాల వల్ల లోలెవల్ కాజ్ వేలు దెబ్బతిని రవాణా ప రంగా ఇబ్బందులు ఏర్పడిన విషయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లానన్నారు. దీంతో భీంగల్ మండలానికి మూడు హైలెవల్ బ్రిడ్జిలు మంజూరు చేశారని తెలిపారు. వీటిలో ఇప్పటికే గోన్ గొప్పుల, మెండోరా వద్ద రెండు వంతెనలు పూర్తయ్యాయని, బెజ్జోరా వద్ద 2.35 కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. వచ్చే మూడు మాసాల్లో పనులు పూర్తి చేయిస్తామని మంత్రి తెలిపారు. ప్రజలు వాస్తవాలను గమనించాలని, ప్రభుత్వ అభివృద్ధిపై ఆలోచనలు చేయాలని కోరారు. అభివృద్ధికి సరి సమానంగా సంక్షేమానికి పాటుపడుతున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. గతంలో 200 రూపాయలకే పరిమితమైన ఆసరా పెన్షన్లను రెండు వేల రూపాయల కు పెంచామని, దివ్యాంగులకు మూడు వేల పెన్షన్‌ను నెలనెలా అందిస్తున్నామని గుర్తు చేశారు.

కల్యాణలక్ష్మి, షాధిముబారక్ పథకాల కిం ద ఎలాంటి పైరవీలకు అస్కారం లేకుండా లక్ష రూపాయల చొప్పున ఆర్థిక తోడ్పాటును సమకూరుస్తున్నామని అన్నారు. నియోజక వర్గ అభివృద్ధి నిధులతో గ్రామగ్రామాన ఆయా కులాల వారికి సంఘ భవనాలు నిర్మింపజేస్తున్నామని మంత్రి తెలిపారు. అనుకొని రీతిలో ఆపదలు, అ నారోగ్యాల బారిన పడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా విరివిగా ఆర్థిక సహాయం ఇప్పిస్తున్నామని అన్నారు. ప్రజల అవసరాలను గుర్తిస్తూ పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న తమ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలవాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాస్, డిసిసిబి వైస్ చైర్మన్, రమేష్‌రెడ్డి, జెడ్పి కో ఆప్షన్ సభ్యుడు మోయిజ్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News