Friday, November 15, 2024

జనవరి 1న ‘హిస్టరీ హంటర్’ 7వ ఎపిసోడ్..

- Advertisement -
- Advertisement -

రాబోయే ‘హిస్టరీ హంటర్’ ఎపిసోడ్ లో గోల్కొండ కోట అసాధారణ చరిత్రను ఆవిష్కరించి, అది చారిత్రక వజ్రాల జన్మస్థలంగా నిలవడమే కాకుండా, శాస్త్రీయ అద్భుతంగా నిలిచిన మధ్యయుగ కోట దాని వెనుక దాగివున్న రహస్యలను ఆవిష్కరించారు. ఎడవ ఎపిసోడ్ జనవరి 1న రాత్రి 9 గంటలకు డిస్కవరీ ఛానల్, డిస్కవరీ+లో ప్రసారం అవుతుంది.

వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ వారి ‘హిస్టరీ హంటర్’ సిరిస్ లో భాగంగా మనీష్ పాల్ తో భారతదేశంలోని పురాతన ఇతిహాసాలు, కథలను వెలికితీసే ఉత్తేజకరమైన ప్రయాణం కొనసాగుతుంది. ముఖ్యంగా రాబోయే ఎపిసోడ్ లో, కోహినూర్, హోప్ డైమండ్, దరియా-ఇ-నూర్తో సహా ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ వజ్రాల జన్మస్థలమైన హైదరాబాద్ లోని గోల్కొండ కోట రహస్యాలను వెల్లడించనున్నారు. ఈ కోట 16వ శతాబ్దంలో అద్బుతమైన శాస్త్రీయ నైపుణ్యానికి, చుట్టుపక్కల ప్రాంతాలను రక్షించడానికి సిబ్బందిని చాకచక్యంగా మోహరించడంతో తిరుగులేనిదిగా పరిగణించబడింది.

గోల్కొండ అంటే గొల్ల కొండ అని అర్థం. దీని మూలలు 1186లో ఒక గొర్రెల కాపరి ఈ కొండపై ఒక విగ్రహాన్ని కనుగొనడంతో ప్రారంభమయ్యాయి. 16వ శతాబ్దంలో ప్రపంచ వజ్రాల రాజధానిగా పరిగణించబడిన ఈ కోట తూర్పు, పశ్చిమ తీరలా మధ్య వాణిజ్య కేంద్రంగా పనిచేసింది. ఈ కోటలో 8 ద్వారాలు, 87 అష్టభుజి ఆకారపు చిన్నకోటలు, కుతుబ్ షాహీ రాజవంశం వారు వ్యూహాత్మకంగా నిర్మించిన 100 ఫిరంగులు ఉన్నాయి. ఇది అధునాతన రక్షణ వ్యవస్థ, అసాధారణమైన నీటి సరఫరా ప్రణాళికతో ఆ కాలంలో ఒక గొప్ప సుల్తానేట్ గా పరిగణించబడింది.

ఇవే కాకుండా రాబోయే ఎపిసోడ్ లో ఈ కోటలోని బాల హిస్సార్ గేట్. ఇది 400 సంవత్సరాల క్రితం ప్యాలెస్ లోపల ఎన్క్లోజర్ల వెంట చప్పట్ల శబ్దంతో కమ్యూనికేషన్ జరిగే ‘క్లాపింగ్ పోర్టికో’ విధానాన్ని దాని శాస్త్రీయ నైపుణ్యం వెనుక ఉన్న రహస్యాలను ప్రేక్షకులు తెలుసుకోనున్నారు. హిస్టరీ హంటర్ 1 జనవరి 2024 రాత్రి 9 గంటలకు డిస్కవరీ+, డిస్కవరీ ఛానెల్లో ప్రసారమయ్యే ఎపిసోడ్ లో గోల్కొండ కోట విజయాలను, పతనానికి దారితీసిన మైలురాయి సంఘటనలను వీక్షించవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News