Wednesday, December 25, 2024

నవంబర్ 20 నుంచి డిస్కవరీలో ‘హిస్టరీ హంటర్’ స్ట్రీమింగ్

- Advertisement -
- Advertisement -

ముంబై: అనేక వారసత్వ కట్టడాలు, ప్రముఖులు, చారిత్రాత్మక సంఘటనల చుట్టూ అల్లుకున్న రహస్య విషయాలతో భారతదేశ చరిత్ర నేటికీ దేశవ్యాప్తంగాప్రజలను ఆకర్షిస్తూనే ఉంది. ఈ ధారావాహికలోని అద్భుతమైన కథలు1500 సంవత్సరాల క్రితం ఉనికిలో ఉన్న ప్రపంచస్థాయి భారతీయ విశ్వవిద్యాలయం నుండితరువాత అకస్మాత్తుగా ప్రపంచపటం నుండి అలాగే ప్రజల జ్ఞాపకాల నుండి అదృశ్యమవ్వడం, ఎలాంటి ఆధునిక యంత్రాలు లేని కాలంలోనే 200 అడుగుల ఎత్తున్న 80 టన్నుల రాయిని ఎత్తడం వంటి ఇంజనీరింగ్ అద్భుతాలను వార్నర్ బ్రదర్స్ వారి డిస్కవరీ నవంబర్ 20న డిస్కవరీ ఛానల్, డిస్కవరీ ప్లస్ ప్రసారమయ్యే ‘హిస్టరీ హంటర్’ప్రీమియర్ సిరిస్ లో అనేక భారతదేశపు చరిత్ర అంచునా దాగిన రహస్యాలను వెలికి తీయనుంది.

ప్రముఖ నటుడు, హోస్ట్ మనీష్ పాల్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ ఎనిమిది భాగాల డాక్యుమెంటరీ సిరిస్ లో భారతీయ చరిత్రలో తెలియనిఅనేక విశేషాలను ఆవిష్కరించనున్నారు. ఈ సిరిస్ లో తమ ముందున్న ప్రశ్నల వెనుక తార్కిక వివరణ, తార్కికతను కనుగొనాలనే మనీష్ తపనకు శాస్త్రనిపుణులు సహకరిస్తారు. దీనిలో టిప్పు సుల్తాన్, అతని తండ్రి హైదర్ అలీ బ్రిటిష్ వారికి ప్రేరణగా నిలిచిన ప్రపంచంలోని మొట్టమొదటి మిలిటరైజ్డ్ రాకెట్లను ఎలా సృష్టించారో కనుగొనడం నుండి, ప్రసిద్ధ సరస్వతి నది ఒక పురాణమా? లేదా వాస్తవమా? అలాగే లక్పథ్ నగరం కోటీశ్వరుల నగరం నుండి పాడుబడిన బంజరు భూమిగా ఎలా మారిందో వెల్లడించడం వరకుఎన్నో అంతుచిక్కని ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ప్రయత్నంలో ‘హిస్టరీ హంటర్’ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.

” ‘హిస్టరీ హంటర్’ సిరిస్ భారతదేశం అంతటా ఒక ఆసక్తికరమైన ప్రయాణాన్ని సాగించే అవకాశాన్నినాకు అందించింది.మన వైవిధ్యమైన భూభాగంలో చెల్లాచెదురుగా ఉన్న పురాతన ఇతిహాసాల రహస్యాలను వెలికితీసేందుకు ఇది వార్నర్ బ్రదర్స్ తో కలిసి పనిచేస్తోందని” ఈ సిరిస్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నమనీశ్ పాల్ తన ఉత్సాహాన్ని పంచుకున్నారు.

ఎనిమిది ఎపిసోడ్ ల ఈ ‘హిస్టరీ హంటర్’ సిరీస్ లో నలంద విశ్వవిద్యాలయం, గోల్కొండ కోట, మహాబలిపురం, తమిళనాడులోని బృహదీశ్వర ఆలయం, లఖ్పత్ నగరం, సరస్వతీ నది వంటి చారిత్రక మైలురాళ్లపై దృష్టి సారించనున్నారు. నానా సాహెబ్ పేష్వా 2 అదృశ్యం, మిలిటరైజ్డ్ రాకెట్లను ప్రపంచానికి పరిచయం చేసిన మొదటి వ్యక్తి టిప్పు సుల్తాన్ కాదా అనే సిద్ధాంతాలను కూడా ఈ సిరిస్ లో అన్వేషించనున్నారు.

డిస్కవరీ దక్షిణాసియా ఫ్యాక్ట్ అండ్ లైఫ్ స్టైల్ క్లస్టర్ హెడ్ సాయి అభిషేక్ మాట్లాడుతూ..”వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ వాస్తవిక విషయాలతో కూడిన వినోదాన్ని ప్రేక్షకులకు అందించడంలో ముందంజలో ఉంది.మా కంటెంట్ భారతదేశంలో దశాబ్దాలు, శతాబ్దాలలో వివిధ చారిత్రాత్మక వాస్తవిక విషయాల ఆధారంగా ప్రేక్షకులకు తెలియని కోణాల ద్వారా చేరవేయబడుతుంది.’హిస్టరీ హంటర్’ అనే మా రాబోయే సిరీస్, భారతీయ చారిత్రక మైలురాళ్ల చుట్టూ ఉన్న అనేక రహస్యాలను ఆవిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సిరిస్ చరిత్రలో దాగిన అనేక సిద్ధాంతాలను వివరించేటప్పుడు వీక్షకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ ప్రాజెక్ట్ లో మనీష్ పాల్ తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఇది మా ప్రేక్షకులకు సుసంపన్నమైన అనుభవాన్ని అందిస్తుందనే నమ్మకం ఉందని” అన్నారు.

‘హిస్టరీ హంటర్’నవంబర్ 20న రాత్రి 9 గంటలకు డిస్కవరీ ఛానల్ లో ప్రసారం కానుంది. డిస్కవరీ+ లో అందుబాటులో ఉండనుంది. ఈ సిరిస్ కు ఎంజీ మోటార్ హెక్టార్, ఫోన్ పే, హార్పిక్ సంయుక్తంగా మీడియా పాట్నర్స్ గా వ్యవహరించనున్నాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News