Wednesday, January 22, 2025

సుత్తి కొడవళ్ళకు పదును పెట్టాలి

- Advertisement -
- Advertisement -

ఎదపై ఎర్ర జెండాను ఎగరవేస్తూ అరుణ పతాకాన్ని చేబూని అడుగులో అడుగు వేస్తున్నా ఓటుకు వచ్చి సరికి జనం ఎందుకు దూరం అవుతున్నారన్న అంశాన్ని సి.పి.ఐ, సి.పి.ఎం పార్టీల నాయకత్వం లోతుగా విశ్లేషణ చేయాల్సిన బాధ్యత ఉంది. ఓటును భౌతికంగా మల్చుకోవడంలో ఎత్తుగడను రూపొందించ డం లేదా! అన్న భావన కలుగుతోంది. సభలకు, సమావేశాలకు, ఆందోళనలకు తరలివచ్చి అరుణ పతాకంతో కదంతొక్కే తాడితులు, పీడితులు, శ్రామి కులు ఓటు వేస్తున్నప్పటికీ ఇతర వర్గాలకు దగ్గర కావడం లేదా! అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

రాటాల కొలిమి నుంచి ఎగిసిపడినవే సుత్తి కొడవళ్ళు. జనహృదయాల్లో అరుణ తారలై నిలుస్తున్నాయి వామపక్షాలు. బుద్ధి జీవుల, కష్ట జీవుల సమస్యలను జెండాగా.. ఎజెండాగా రూపొందించి పోరాట కొలిమిలో సుత్తీ కొడవళ్ళకు పదును పెడుతున్నాయి సి.పి.ఐ, సి.పి.ఎం పార్టీలు. ఏ సమస్య వచ్చినా గుండెగుండెను కదిలించి, గడప గడపను పలకరించి అరుణ సైన్యంలా పోరాట పథంలో సాగుతున్న సి.పి.ఐ, సి.పి.ఎం పార్టీల ప్రాధాన్యత లోక్‌సభలో క్రమంగా తగ్గుతొంది. లోక్‌సభలో జనగళాన్ని వినిపించడానికి వామపక్ష పార్టీల ప్రధానంగా సి.పి.ఐ, సి.పి.ఎం సభ్యుల సంఖ్య పెరగాల్సి వుండగా, 1984 నుంచి 2019 ఎన్నికల వరకు తగ్గుతూ వస్తోంది.1951 లోక్‌సభ ఎన్నికల నుంచి 1984 ఎన్నికల వరకు సి.పి.ఐ, 1967 ఎన్నికల నుంచి 1984 ఎన్నికల వరకు సి.పి.ఎం సభ్యుల సంఖ్య లోక్‌సభలో గణనీయంగా ఉండేంది.

ఎదపై ఎర్ర జెండాను ఎగరవేస్తూ అరుణ పతాకాన్ని చేబూని అడుగులో అడుగు వేస్తున్నా ఓటుకు వచ్చి సరికి జనం ఎందుకు దూరం అవుతున్నా రన్న అంశాన్ని సి.పి.ఐ, సి.పి.ఎం పార్టీల నాయకత్వం లోతుగా విశ్లేషణ చేయాల్సిన బాధ్యత ఉంది. ఓటును భౌతికంగా మల్చుకోవడంలో ఎత్తుగడను రూపొందించడం లేదా! అన్న భావన కలుగుతోంది. సభలకు, సమావేశాలకు, ఆందోళనలకు తరలివచ్చి అరుణ పతాకంతో కదంతొక్కే తాడితులు, పీడితులు, శ్రామికులు ఓటు వేస్తున్నప్పటికీ ఇతర వర్గాలకు దగ్గర కావడం లేదా! అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. 1951లో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో సి.పి.ఐ 99 స్థానాల్లో పోటీ చేయగా 16 స్థానాల్లో విజయం సాధించి 3.29 శాతం ఓట్లు సాధించగా, 1957 లో 110 స్థానాల్లో పోటీ చేయగా 27 స్థానాల్లో విజయం సాధించి 8.29% ఓట్లు వచ్చాయి.

1962లో 137 స్థానాల్లో పోటీగా 29 స్థానాల్లో విజయం సాధించి 9.94 శాతం ఓట్లు రాగా, 1967లో 109 స్థానాల్లో పోటీ చేయగా 23 స్థానాల్లో గెలుపొంది. 5.11 శాతం ఓట్లు వచ్చాయి. 1971లో 87 పోటీ చేయగా 23 స్థానాల్లో సాధించి 4.73 శాతం ఓట్లు, 1977లో 81 స్థానాల్లో పోటీ చేసి 7 స్థానాల్లో విజయం సాధించి 2.82 శాతం వచ్చాయి. 1980లో 47 స్థానాల్లో పోటీ చేసి 10 స్థానాల్లో గెలిచి 2.49 శాతం, 1984లో 61 స్థానాల్లో పోటీ చేసి 6 స్థానాల్లో విజయం సాధించి 2.71 ఓటింగ్ శాతం వచ్చింది. 1989లో 50 స్థానాల్లో పోటీ చేసి 12 స్థానాల్లో విజయం సాధించి 2.57% ఓట్లు, 1991లో 42 స్థానాల్లో పోటీచేసి 14 స్థానాల్లో విజయం సాధించి 2.49 శాతం ఓటింగ్‌ను సి.పి.ఐ సాధించింది. 1996లో 43 స్థానాల్లో పోటీ చేయగా 12 స్థానాల్లో విజయం సాధించి 1.93 ఓటింగ్ శాతం, 1998లో 58 స్థానాల్లో పోటీ చేసి 9 స్థానాల్లో విజయం సాధించి 1.79% ఓటింగ్‌ను సాధించింది.

1999లో 54 స్థానాల్లో పోటీ చేసి 4 స్థానాల్లో గెలిచి 1.48% ఓటింగ్ సి.పి.ఐ పొందింది. 2004లో 34 స్థానాల్లో పోటీ చేసి 10 స్థానాల్లో జయభేరి మోగించి 1.41%, 2009లో 56 స్థానాల్లో పోటీ చేసి 4 స్థానాల్లో విజయం సాధించి 1.43 శాతం ఓటింగ్‌ను పొందింది. 2014లో 67 స్థానాల్లో పోటీ చేసి 1 స్థానాల్లో గెలిచి 0.79 శాతం, 2019లో 49 స్థానాల్లో పోటీ చేసి 2 స్థానాల్లో గెలచి 0.59 శాతం ఓటింగ్‌ను పొందింది సి.పి.ఐ. కాగా 1967 నుంచి 2019 వరకు సి.పి.ఐ (ఎం) సాధించిన ఫలితాలను చూద్దాం. 1967లో 59 స్థానాల్లో పోటీ చేయగా 19 స్థానాలు గెలిచి 4.28 శాతం ఓట్లు, 1971లో 85 స్థానాల్లో పోటీ చేసి 25 స్థానాల్లో విజయం సాధించి 5.12 ఓటింగ్ శాతాన్ని పొందింది.

1977లో 53 స్థానాల్లో పోటీ చేసి 22 స్థానాల్లో గెలిచి 4.29% ఓటింగ్, 1980లో 64 స్థానాల్లో పోటీ చేసి 37 స్థానాల్లో విజయం సాధించి 6.24 శాతం ఓటింగ్‌ను సి.పి.ఎం పొందింది. 1984లో 59 స్థానాల్లో పోటీ చేసి 22 స్థానాల్లో గెలిచి 5.81% ఓటింగ్, 1989లో 64 స్థానాల్లో పోటీ చేసి 33 స్థానాల్లో విజయం సాధించి 6.55 శాతం ఓటింగ్‌ను పొందింది. 1991లో 60 స్థానాల్లో పోటీ చేసి 35 స్థానాల్లో విజయం సాధించి 6.15% ఓట్లను పొందింది.1996లో 75 స్థానాల్లో పోటీచేసి 32 స్థానాల్లో విజయం సాధించి 6.12% ఓటింగ్‌ను సాధించగలిగింది. 1998లో 71 స్థానాల్లో పోటీ చేసి 32 స్థానాల్లో విజయ భేరి మోగించి 5.15% ఓటింగ్‌ను సాధించింది.

1999లో 72 స్థానాల్లో పోటీ చేసి 33 స్థానాల్లో విజయం సాధించి 5.40% ఓటింగ్‌ను పొందింది. 2004లో 69 స్థానాల్లో పోటీ చేసి 33 స్థానాల్లో గెలిచి 5.66% ఓటింగ్‌ను పొందింది. 2009లో 82 స్థానాల్లో పోటీచేసి 16 స్థానా లు గెలిచి 5.33% ఓటింగ్‌ను సాధించింది. 2014లో 93 స్థానాల్లో పోటీ చేసి 9 స్థానాలు గెలిచి 3.28% ఓటింగ్‌ను, 2019లో 69 స్థానాల్లో పోటీ చేసి 3 స్థానాల్లో విజయం సాధించి 1.77% ఓటింగ్‌ను పొందింది. 1999, 2009, 2014, 2019లో జరిగిన ఎన్నికలు సి.పి.ఐ ను నిరాశ కల్పించగా, 2014, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలు సి.పి.ఎంకు ఆందోళన కలిగించింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సుత్తికొడవళ్ళకు సానబెట్టి ఎన్నికల కురుక్షేత్రంలో అరుణ పతాకాన్ని రెపరెపలాడించాల్సిన బాధ్యత సి.పి.ఐ, సి.పి.ఎం నాయకత్వం పై ఉంది.

గుర్రం రాంమోహన్ రెడ్డి
7981018644

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News