Friday, December 20, 2024

వయోలెన్స్‌ను తన అందంతో బ్యాలెన్స్ చేసింది..

- Advertisement -
- Advertisement -

‘హిట్ ది ఫస్ట్ కేస్’ అనే క్రైమ్ థ్రిల్లర్‌తో దర్శకుడిగా తెరంగేట్రం చేసి టైటిల్‌కు తగ్గట్టే హిట్ సాధించారు శైలేష్ కొలను. ఇప్పుడు ఆయన హిట్ యూనివర్స్‌ని రూపొందించారు. ‘హిట్ 2 ది సెకండ్ కేస్’ తాజాగా విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈక్రమంలో చిత్రయూనిట్ విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ “సినిమాలోని వయోలెన్స్‌ను మీనాక్షి తన అందంతో బ్యాలెన్స్ చేసింది. శ్రీనాథ్ చక్కగా నటించారు. సుహాస్ అద్భుతంగా నటించాడు. నేను మ్యాజిక్‌ని నమ్ముతాను. కానీ శేష్ మాత్రం లాజిక్‌ను నమ్ముతాడు. అందుకే ఇలా వరుసగా సక్సెస్‌లు కొడుతున్నాడు”అని అన్నారు.

అడివి శేష్ మాట్లాడుతూ.. “ఈ సినిమా చూసిన మహేష్ బాబు ‘నిన్ను చూసి గర్వపడుతున్నాను శేష్’ అన్నారు.. నాకు వెంటనే కంట్లో నీళ్లు తిరిగాయి. ‘నీకు ఎప్పుడూ నేను అన్నలా అండగా ఉంటాను’ అని అన్నారు. నాకు ఆ మూమెంట్ ఎంతో స్పెషల్‌గా అనిపించింది. నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు దర్శకుడు శైలేష్ కొలనుకు థాంక్స్. మీనాక్షి మీద వస్తున్న ప్రశంసలు చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. నేను ఇంత వరకు పని చేసిన ప్రొడక్షన్ కంపెనీల్లో ప్రశాంతి, నాని ప్రొడక్షన్‌లది ది బెస్ట్‌”అని చెప్పారు.

డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ “మల్టీప్లెక్సుల్లోనే కాదు.. సింగిల్ స్క్రీన్స్‌లోనూ క్లైమాక్స్ చూస్తూ ప్రేక్షకులు అరుస్తూనే ఉన్నారు. సినిమా కోసం పని చేసిన అందరికీ థాంక్స్‌”అని చెప్పారు. ఈ వేడుకలో మీనాక్షి చౌదరి, ప్రశాంతి, ఎంఎం శ్రీలేఖ, కోమలి ప్రసాద్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News