Saturday, January 11, 2025

‘హిట్ 2’ వచ్చేది అప్పుడే..

- Advertisement -
- Advertisement -

HIT 2 Movie to release on July 29th

హీరో నాని వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పై హిట్ సినిమాకు ఫ్రాంచైజీగా ‘హిట్ 2 ద సెకండ్ కేస్’ చిత్రాన్ని రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా ఇది. హిట్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలోనే ‘హిట్ 2 ద సెకండ్ కేస్’ సినిమా రూపొందుతోంది. అయితే ఈ చిత్రాన్ని జులై 29న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. టాలెంటెడ్ హీరో అడివి శేష్ ఇందులో హీరోగా నటించారు. ఈ మూవీలో అడివి శేష్… కృష్ణ దేవ్ అలియాస్ కె.డి పాత్రలో మెప్పించనున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీస్ ఆఫీసర్ అమ్మాయి మిస్సింగ్ కేసుని ఎలా డీల్ చేశాడనే కాన్సెప్ట్‌తో హిట్ సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చెందిన ఆఫీసర్ కృష్ణ దేవ్ అలియాస్ కె.డి ఆసక్తికరమైన జర్నీతో ‘హిట్ 2’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

HIT 2 Movie to release on July 29th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News