Wednesday, September 18, 2024

నాని జోరు.. ‘హిట్ 3’ షూటింగ్ షురూ

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని తన 32వ మూవీ ‘హిట్: ది థర్డ్ కేస్’లో మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్ ని పోషిస్తున్నారు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. హిట్ ఆఫీసర్‌గా నాని క్యారెక్టర్ పరిచయం చేసిన గ్రిప్పింగ్ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో నాని మొదటి రోజే షూట్‌లో జాయిన్ అయ్యారు. ఈ మూవీలో హిట్ ఆఫీసర్ అర్జున్ సర్కార్‌గా ఫెరోషియస్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు నాని. ఈ క్యారెక్టర్ కోసం నాని పూర్తిగా మేకోవర్ అయ్యారు. మే 1, 2025న వేసవిలో హిట్ 3 థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News