Friday, November 22, 2024

కారు రూఫ్‌పై ఎగిరిపడ్డ బైకర్: 3 కి.మీ. ప్రయాణం.. గాయాలతో మృతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని హై సెక్యూరిటీ విఐపి జోన్‌లో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో ఒక యువకుడు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం రాత్రి కస్తూర్బా గాంధీ మార్గ్, టాల్‌స్టాయ్ మార్గ్ మధ్యలో జరిగిన ఈ ఘటనను ఒక ప్రత్యక్ష సాక్షి సెల్‌ఫోన్‌లో బంధించాడు. మృతుడిని దీపాంశు వర్మ(30), గాయపడిన వ్యక్తిని అతని వరుసగా సోదరుడు ముకుల్‌గా పోలీసులు గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముకుల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జువెలెరీ షాపు యజమాని అయిన వర్మకు తల్లిదండ్రులు, ఒక సోదరి ఉన్నారు.

Also Read: కేదార్నాథ్లో భారీ హిమపాతం.. మంచులో చిక్కుకున్న తెలుగు యాత్రికులు (వీడియో)

ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం..వర్మ బైక్ నడుపుతుండగా ముకుల్ వెనుక కూర్చున్నాడు. వారి బైక్‌ను వేగంగా దూసుకు వచ్చిన ఒక కారు ఢీకొంది. ముకుల్ ఎగిరి కొన్ని అడుగుల దూరంలో పడ్డాడు. కాగా..వర్మ కారు రూఫ్ మీద పడ్డాడు. అయితే కారు నడుపుతున్న వ్యక్తి కారును ఆపకుండా వేగంగా ముందుకు పోనిచ్చాడు. గాయపడిన వ్యక్తి కారు రూఫ్ మీద ఉన్నప్పటికీ అతను కారు ఆపకుండా వేగంగా దూసుకువెళ్లాడు.

Also Read: సినిమా రిహార్సల్‌లో గాయపడ్డ హీరో చియాన్ విక్రమ్..

ఇదంతా గమనిస్తున్న ఒక వ్యక్తి తన స్కూటర్‌తో కారును వెంబడిస్తూ తన సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. దాదాపు 3 కిలోమీటర్ల దూరం వెళ్లాక కారును ఆపిన వ్యక్తి రూఫ్‌పై ఉన్న వర్మను కిందకు లాగి రోడ్డుపై పడేసి కారుతో పరారయ్యాడు. వర్మ, ముకుల్‌ను ఆసుపత్రికి తరలించగా తీవ్ర గాయాలపాలైన వర్మ చికిత్స పొందుతూ మరణించాడు. ఢిల్లీ పోలీసులు హత్య కేసు నమోదు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిందితుల పేర్లను పోలీసులు ఇప్పటివరకు వెల్లడించలేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News