Wednesday, December 25, 2024

విజయ్ ఆంటోనీ “హిట్లర్” టీజర్ రిలీజ్

- Advertisement -
- Advertisement -

పలు వైవిధ్యమైన చిత్రాలతో సౌత్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్న హీరో విజయ్ ఆంటోనీ తన కొత్త సినిమా “హిట్లర్”తో తెరపైకి రాబోతున్నాడు. విజయ్ ఆంటోనీతో గతంలో “విజయ్ రాఘవన్” అనే మూవీని నిర్మించిన చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ తమ 7వ ప్రాజెక్ట్ గా “హిట్లర్” సినిమాను నిర్మిస్తోంది. డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మాతలు. “హిట్లర్” సినిమాను యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ధన రూపొందిస్తున్నారు. ఇవాళ ఈ సినిమా టీజర్ ను రిలీజ్  చేశారు.

“హిట్లర్” టీజర్ ఎలా ఉందో చూస్తే – డిక్టేటర్ లాంటి ఒక రాజకీయ నాయకుడు, అతన్ని వేటాడే ఓ కిల్లర్, ఆ ప్లాన్ ను అడ్డుకుని..కిల్లర్ ను టార్గెట్ చేసిన ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్… ఈ మూడు పాత్రలను పరిచయం చేస్తూ టీజర్ సాగింది. పోలీస్ ఆఫీసర్ టార్గెట్ రీచ్ అయ్యి కిల్లర్ ను పట్టుకోవడం, అయినా కిల్లర్ నవ్వుతూ కనిపించడం టీజర్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో లవ్ ట్రాక్ కు కూడా ఇంపార్టెన్స్ ఉన్నట్లు చూపించారు. కిల్లర్ గా విజయ్ ఆంటోనీ కొత్త లుక్, క్యారెక్టరైజేషన్ లో కనిపించారు. వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ వ్యాల్యూస్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్ తో టీజర్ ఆకట్టుకుంది.

ప్రజాస్వామ్యం పేరుతో కొందరు పాలకులు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. అలాంటి నియంతను ఎదుర్కొనే ఓ సాధారణ పౌరుడి కథే “హిట్లర్”. ఈ సినిమాను త్వరలోనే పాన్ ఇండియా స్థాయిలో హిందీతో పాటు తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News