Monday, December 23, 2024

ఫ్రాన్స్ సంస్థ ఇనాక్‌తో హెచ్‌ఐటిఎస్ ఒప్పందం

- Advertisement -
- Advertisement -

చెన్నై : హిందుస్తాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (హెచ్‌ఐటిఎస్) తాజాగా ఫ్రాన్స్‌కు చెందిన ఏవియేషన్ స్కూల్- ఇకోల్ నేషనల్ డి ఏవియేషన్ సివిల్ (ఇఎన్‌ఎసి)తో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ ఎంఒయులో భాగంగా హెచ్‌ఐటిఎస్ ఇప్పుడు అత్యాధునిక మాస్టర్స్ ప్రోగ్రామ్‌ను ఏవియేషన్ సేఫ్టీ మేనేజ్‌మెంట్‌లో ఇనాక్ భాగస్వామ్యంతో అందిస్తుంది. ఏవియేషన్ సేఫ్టీ మేనేజ్‌మెంట్, ఎంబిఎ ప్రోగ్రామ్‌లో చేరేందుకు బ్యాచులర్స్, మాస్టర్స్ డిగ్రీతో పాటుగా ఏవియేషన్ పరిశ్రమలో కనీసం మూడు సంవత్సరాల ప్రొఫెషనల్ అనుభవం అవసరం. ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా ఎయిర్‌లైన్, ఎయిర్‌పోర్ట్, ఏవియేషన్ పరిశ్రమలో సంబంధిత ప్రొఫెషనల్స్ కోసం ఉద్దేశించారు. ఈ ఒప్పందంపై సంతకాలను ఇనాక్ అధ్యక్షులు ఓలీవర్ చాన్సౌ, హెచ్‌ఐటిఎస్ చాన్స్‌లర్ ఆనంద్ జాకోబ్ వర్గీసీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News