Monday, December 23, 2024

హిట్స్‌ ఆన్‌లైన్‌ ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష..

- Advertisement -
- Advertisement -

Hits Online Engineering Entrance Exam from May 25th

న్యూఢిల్లీ: హిందుస్తాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (హిట్స్‌) తమ ఆన్‌లైన్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష– హిట్స్‌ ఈఈఈ 2022, లిబరల్‌ ఆర్ట్స్‌, అనుబంధ శాస్త్రాలు, స్కూల్‌ ఆఫ్‌ లా, ఇతర ప్రోగ్రామ్‌ల కోసం హిట్స్‌ క్యాట్‌ 2022ను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ ఆన్‌లైన్‌ ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలు 2022–2023 విద్యా సంవత్సరం కోసం జరుగనున్నాయి. ఈ పరీక్షలను రెండు దశలలో నిర్వహించనున్నారు. మొదటి దశ పరీక్షలు మే 25, 2022 నుంచి 30 మే 2022 వరకూ జరిగితే, రెండవ దశ పోటీలు 16 జూన్‌ 2022 నుంచి 18 జూన్‌ 2022 వరకూ జరుగనున్నాయి. విద్యార్ధులు ఆన్‌లైన్‌లో apply.hindustanuniv.ac.in వద్ద దరఖాస్తు చేయవచ్చు.

మొదటి దశ కోసం దరఖాస్తులు పంపించడానికి ఆఖరుతేదీ మే 23 కాగా, రెండవ దశ కోసం 12 జూన్‌ 2022వరకూ దరఖాస్తులు పంపవచ్చు. ఫలితాలను 20 జూన్‌ 2022న వెల్లడించనున్నారు. కౌన్సిలింగ్‌ 24 జూన్‌2022 నుంచి 30 జూన్‌ 2022 వరకూ జరుగనుంది.

Hits Online Engineering Entrance Exam from May 25th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News