Monday, December 23, 2024

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులకు ఎదురు దెబ్బ

- Advertisement -
- Advertisement -

Hizbul commander killed in encounter

న్యూఢిల్లీ: దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో జరిగిన కాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది హతమయ్యాడు. శుక్రవారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో ముగ్గురు సైనికులు, ఒక పౌరుడు గాయపడ్డారు. హతమైన ఉగ్రవాది హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ నిసార్ అహ్మద్ ఖండేగా పోలీసులు గుర్తించారు. ఖాండే నాలుగేళ్ల క్రితం 2018లో తీవ్రవాదుల్లో చేరాడు. “నిషిద్ధ సంస్థకు చెందిన టెర్రరిస్ట్ కమాండర్ హెచ్‌ఎం నిసార్ ఖండే హతమయ్యాడు. ఒక ఎకె 47 రైఫిల్‌తో సహా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాం” అని జమ్మూకాశ్మీర్ పోలీస్ ట్వీట్ చేసారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News