Monday, January 20, 2025

బెంగళూరులో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Hizbul Mujahideen militant arrested in Bangalore

బెంగళూరు : హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది ఒకరిని కశ్మీర్ పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. ఈ ఘటన ఒక్కసారిగా రాష్ట్ర పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. కశ్మీర్‌కు చెందిన తాలిబ్ హుస్సేన్ రెండేళ్లుగా బెంగళూరులో ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ భార్యతో కలిసి శ్రీరాంపుర ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. చుట్టుపక్కల వ్యక్తులకు కూడా అనుమానం రాకుండా ఉగ్రవాద సంస్థ తరుపున అతను కార్యకలాపాలను నడిపిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. జమ్ము కశ్మీర్ పోలీసులు వారం రోజుల క్రితం బెంగళూరు వచ్చి ఈ కేసుకు సంబంధించిన సమాచారం సీనియర్ పోలీసులకు అందించారు.

అతని ఇంటిని కనిపెట్టే విషయంలో బెంగళూరు పోలీసుల సాయం తీసుకున్నారు. ఈ నెల 3 న సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి తాలిబ్ హుస్సేన్‌ను అరెస్టు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. హుస్సేన్‌కు ఇద్దరు భార్యలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఒకామ్ జమ్ముకశ్మీర్ లోని కిష్టార్‌లో ఉంటోంది. మరో ఆమె బెంగళూరులో అతనితో కలిసి ఉంటోంది. కిష్టార్ నివాసి అయిన హుస్సేన్ ఆటో డ్రైవర్‌గా రెండేళ్లుగా బెంగళూరు లోనే ఉంటున్నప్పటికీ అతని గురించి ఎవరికీ ఏమీ తెలియదు. హుస్సేన్ 2016 లో హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థలో చేరి, యువకులను రిక్రూట్ చేస్తూ వచ్చేవాడని పోలీసులు అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News