Sunday, December 22, 2024

హిజ్బుల్ టెర్రరిస్టు జావెద్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వాంటెడ్ టెర్రరిస్టు, హిజ్బుల్ ముజాహిద్దిన్ ప్రముఖుడు జావెద్ అహ్మద్ మట్టూను ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం గురువారం అరెస్టు చేసింది. జమ్మూ కశ్మీర్‌లో పలు ఘటనలకు జావెద్ కారకుడు అనే అభియోగాలు ఉన్నాయి. మట్టూ ఢిల్లీలో సంచరిస్తున్నాడనే సమాచారం అందడంతో ప్రత్యేక బృందం కేంద్ర భద్రతా సంస్థల సమన్వయంతో ఈ టెర్రరిస్టును పట్టుకుంది. మట్టూ నుంచి ఓ పిస్టల్ , ఆరు తూటాలు స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ కశ్మీర్‌లో 11 ఉగ్రచర్యలు ఉదంతాలలో జావెద్‌పై వారంటు ఉంది. ఆయనను పట్టుకుంటే రూ పదిలక్షల నజరానా ప్రకటించారు. జమ్మూ కశ్మీర్‌లో ఓ ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడ్డ మట్టూ ఏదో విధంగా నేపాల్ తప్పించుకుని వెళ్లాడు.

ఎప్పటికప్పుడు పాకిస్థాన్ ఐఎస్‌ఐ నుంచి ఆదేశాలు అందుకుంటూ వ్యవహరిస్తున్న మట్టూ తిరిగి ఢిల్లీకి వస్తున్నట్లు నిఘా సంస్థలకు తెలిసింది. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, మందుపాతరలు సేకరించుకునేందుకు మట్టూ వస్తున్నట్లు తెలియడంతో నిఘా సంస్థలు ముందుగా అప్రమత్తతో ఉండటం, ఆయుధాల విక్రయదార్లపై కన్నేసి ఉంచారు. చివరికి పట్టుకున్నారని వెల్లడైంది. సోపోరో నివాసి అయిన జావెద్ మట్టూ పలుసార్లు పాకిస్థాన్ వెళ్లి వచ్చాడు. ఐదు గ్రనేడ్ దాడులు, వివిధ ప్రాంతాలలో ఐదుగురు పోలీసు జవాన్లపై దాడులు వారు చనిపోయిన ఘటనలకు కూడా కారకుడు అని తేల్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News