Thursday, November 14, 2024

హిజ్బుత్ తహ్రీర్ కేసు..ఛార్జీషీటు దాఖలు చేసిన ఎన్‌ఐఎ

- Advertisement -
- Advertisement -

దేశంలో షరియా చట్టం అమలుకు కుట్ర
17 మందిని నిందితులుగా పేర్కొన్న వైనం
ముస్లిం యువతను ఆకర్షించి ఇస్లామిక్ రాడికల్స్‌గా మారుస్తున్నారు
చార్జీషీట్‌లో వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన హిజ్బుత్ తహ్రీర్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) ఆదివారం ఛార్జ్‌షీట్ దఖలు చేసింది. దేశంలో షరియా చట్టం అమలుకు కుట్రపన్నిన 17 మందిని నిందితులుగా పేర్కొంది. వీరు ముస్లిం యువతను ఆకర్షించి ఇస్లామిక్ రాడికల్స్‌గా మారుస్తున్నట్లు ఛార్జ్‌షీట్‌లో తెలిపింది.

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో యాసిర్ అనే వ్యక్తిని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేయడంతో ఈ కుట్ర వెలుగుచూసింది. ఈ ఏడాది మే నెలలో భోపాల్, హైదరాబాద్ నగరాల్లో దాడులు నిర్వహించిన మధ్యప్రదేశ్ ఎటిఎస్ 17 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించింది. అనంతరం దర్యాప్తు ప్రారంభించిన ఎన్‌ఐఎ కీలక విషయాలను వెలుగులోకి తెచ్చింది. ముస్లిం యువతను ఇస్లామిక్ రాడికల్స్‌గా మార్చేందుకు గాను ఈ ముఠా తుపాకీ కాల్చడం, దాడులు చేయడంపై రహస్య ప్రాంతాల్లో శిక్షణ ఇచ్చినట్లు తేల్చింది. ప్రధాన సూత్రధారి యాసిర్‌తో పాటు మరికొందరు హైదరాబాద్ వచ్చి యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేలా ప్రేరేపించినట్లు ఎన్‌ఐ దర్యాప్తులో వెల్లడైంది. పోలీసులతో పాటు ఓ వర్గాన్ని టార్గెట్ చేసి దాడులు చేసేందుకు ఈ గ్యాంగ్ కుట్ర పన్నినట్లుగా గుర్తించింది. జాతీయ సమగ్రత, భద్రత, ఐక్యతను దెబ్బతీసేందుకు హిజ్బుత్ తహ్రీర్ కుట్ర పన్నినట్లు తన ఛార్జ్‌షీట్‌లో వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News