Friday, December 27, 2024

మార్కెట్లోకి మరో కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. పూర్తివివరాలివే!

- Advertisement -
- Advertisement -

స్మార్ట్‌ఫోన్ తయారీదారు హెచ్‌ఎమ్‌డి తన కొత్త ఫోన్ హెచ్‌ఎమ్‌డి ఫ్యూజన్‌ను ఈరోజు భారతదేశ మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ 8జీబీ ర్యామ్‌తో పాటు 256జీబీ నిల్వను అందించింది. కాగా ఈ ఫోన్ 108 మెగాపిక్సెల్‌ల ప్రాథమిక కెమెరాను కలిగి ఉంది. డిజైన్ గురించి చెప్పాలంటే, ఈ ఫోన్ లుక్ చాలా ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉంది. ఇక ఈ ఫోన్ పూర్తి వివరాల్లోకి వెళ్తే..

స్పెసిఫికేషన్‌లు

ఈ ఫోన్‌లో 6.56 అంగుళాల HD+ డిస్‌ప్లేను అందించింది. కాగా, ఈ డిస్ప్లే 90 Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ హెచ్‌ఎమ్‌డి ఫ్యూజన్ గేమింగ్ అవుట్ ఫిట్, హెచ్‌ఎమ్‌డి ఫ్యూజన్ ఫ్లాష్ అవుట్ ఫిట్ లో విడుదల చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌తో అమర్చబడింది.

ఇక ఈ ఫోన్ కెమెరా గురించి మాట్లాడుతే.. హెచ్‌ఎమ్‌డి ఫ్యూజన్ 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు.. సెకండరీ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఈ ఫోన్ లో 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. నైట్ మోడ్, ఫ్లాషీ షాట్ 2.0 వంటి ఫీచర్లు కూడా ఉండడం విశేషం.

ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ ఫోన్ లో 5000mAh శక్తివంతమైన బ్యాటరీ అందించబడింది. ఈ బ్యాటరీ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది. హెచ్‌ఎమ్‌డి ఫ్యూజన్ ఆండ్రాయిడ్14 ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేస్తుంది. ఫోన్ 2 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుంది.

చివరగా, ఈ ఫోన్ ధరల గురించి మాట్లాడుతే.. కంపెనీ హెచ్‌ఎమ్‌డి ఫ్యూజన్ ధరను రూ.17,999గా నిర్ణయించింది. అయితే, కంపెనీ ఇప్పుడు ఫోన్‌ను రూ.15,999 ప్రత్యేక ధరతో విడుదల చేస్తోంది. అయితే, ఈ ధరకు పరిమిత సమయంలో మాత్రమే కొనుగోలు చేయగలుగుతాము. ఈ ఫోన్ సేల్ నవంబర్ 29 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఫోన్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఇ-కామర్స్ సైట్ అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News