Monday, December 23, 2024

మరో 7 అక్రమ నిర్మాణాలపై హెచ్‌ఎండిఏ చర్యలు

- Advertisement -
- Advertisement -

HMDA actions on another 7 illegal structures

నార్సింగి, శంషాబాద్ మున్సిపాలిటీల పరిధిలో టాస్క్‌ఫోర్స్ కూల్చివేతలు

మనతెలంగాణ/హైదరాబాద్ : డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ టీమ్స్, హెచ్‌ఎండిఎ అధికారులు శనివారం నార్సింగి, శంషాబాద్ మున్సిపాలిటీల పరిధిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టారు. నార్సింగి మున్సిపాలిటీలో (4) అక్రమ నిర్మాణాలు, శంషాబాద్ మున్సిపాలిటీలో (3) అక్రమ నిర్మాణాలపై హెచ్‌ఎండిఏ అధికారులు కొరడా ఝుళిపించారు. నార్సింగి మున్సిపాలిటీ వట్టినాగులపల్లి వద్ద ఎకరం విస్తీర్ణంలో అక్రమంగా నిర్మించిన కమర్షియల్ షెడ్డును టాస్క్‌ఫోర్స్ అధికారులు సీజ్ చేయగా, ఇదే మున్సిపాలిటీ పరిధిలో రెండు షెడ్‌లను (ఒకటి ఎకరం, మరొకటి 34 గుంటలు) టాస్క్‌ఫోర్స్ అధికారులు కూలగొట్టారు. కోకాపేట వద్ద అక్రమంగా నిర్మించిన మరో కమర్షియల్ షెడ్‌ను సైతం అధికారులు సీజ్ చేశారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సర్వే నెంబర్ 3లో (5) ఎకరాల విస్తీర్ణంలో అక్రమంగా నిర్మిస్తున్న విల్లాల కాలమ్స్, స్లాబ్‌లను టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూల్చివేశాయి. ఇదే మున్సిపాలిటీ పరిధిలో మరో రెండు అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. 13వ రోజు (శనివారం) వరకు మొత్తం 114 అక్రమ నిర్మాణాలపై డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్, హెచ్‌ఎండిఎ చర్యలు తీసుకుంది. వాటిలో 89 కూల్చివేతలు, 25 సీజ్ చేశామని హెచ్‌ఎండిఏ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News