Thursday, January 23, 2025

సిఎం కెసిఆర్‌ను కలిసి హెచ్‌ఎండిఎ కమిషనర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మాణ పునరుద్దరణ చేపట్టిన 5 నిర్మాణాలకు ఇటీవల ప్రపంచ ప్రఖ్యాత ‘ఇంటర్నేషనల్ బ్యూటీఫుల్ బిల్డింగ్స్ గ్రీన్ యాపిల్ అవార్డు’లను లండన్‌లో అందుకున్న ఎంఎయుడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఎచ్‌ఎండిఎ మెట్రోపాలిటన్ కమిషనర్ అరవింద్ కుమార్ బుధవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిశారు.

తెలంగాణ రాష్ట్రం గెలుచుకున్న అవార్డులను సిఎం కెసిఆర్‌కు అందజేశారు.ఈ సందర్భంగా అరవింద్‌కుమార్ తన పర్యటన విశేషాలను సిఎంకు వివరించారు. తెలంగాణ కట్టడాలకు అంతర్జాతీయ వేదిక మీద అందుకున్న ప్రశంసలను తదితర ప్రత్యేకతలను సిఎంకు తెలిపారు. ఈ సందర్భంగా అర్వింద్ కుమార్‌ను సిఎం కెసిఆర్ మరోసారి అభినందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News