Saturday, February 22, 2025

హైడ్రా హైరానా

- Advertisement -
- Advertisement -

 సహకరించని రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులు చెరువుల
వివరాలు అందించడంలో నిర్లక్షం పెండింగ్‌లో 549 చెరువుల
వివరాలు సిఎం దృష్టికి తీసుకెళ్లాలని కమిషనర్ రంగనాథ్ యోచన

మన తెలంగాణ/సిటీ బ్యూరో : చెరువుల ప రిరక్షణపై ఫోకస్ పెట్టిన హైడ్రాకు జిల్లాల రె వెన్యూ, ఇరిగేషన్ అధికారుల నుంచి ఆశించిన సహకారం లభించడంలేదు. దీంతో ప దేపదే జిల్లా రెవెన్యూ అధికారులను సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడిందని హైడ్రా అ ధికారులు అసహనానికి లోనవుతున్నారు. ప్రస్తుతం హైడ్రా కమిషనర్‌గా ఉన్న రంగనాథ్‌కు అదనంగా లేక్ ప్రొటెక్షన్ ఛైర్మన్ బాధ్యతలను కూడాప్రభుత్వం అప్పగించింది. దీం తో ఓఆర్‌ఆర్ లోపలివైపున ఉన్న చెరువుల ను కాపాడటం, భవిష్యత్ తరాలకు అందించడంపై హైడ్రా కమిషనర్ ప్రత్యేక ఫోకస్ పె ట్టారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువులకు ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లను ఖరారు చేసి చెరువులకు ఓ రూపం తీసుకొచ్చేందు కు హైడ్రా ప్లాన్ చేసింది.ఇందులోభాగంగా ఎన్‌ఆర్‌ఎస్‌సి,సర్వేఆఫ్‌ఇండియా,రెవె న్యూ, ఇరిగేషన్ అధికారుల సమాచారంతో చెరువుల హద్దులను నిర్ణయించి, వాటి విస్తీ ర్ణం, ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లను ఫిక్స్ చే యాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్లాన్ చేశారు. ఓఆర్‌ఆర్ లోపల ఉన్న 549 చెరువుల వివరాలు ఇవ్వాలని

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను హైడ్రా కమిషనర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్ రంగనాథ్ కోరినా.. వారి నుంచి స్పందన ఆశించిన మేర రావడంలేదని అధికారులు విమర్శిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో 185, గ్రేటర్ వెలుపల 364 చెరువులు ఏమేర విస్తీర్ణంతో ఉన్నాయి. వాటి నక్ష, వాటి భౌగోళిక స్వరూపం, వాటికి ఉన్న లింక్ కాలువలు, సర్వే నెంబర్లు వంటి వివరాలను హైడ్రాకు ఇవ్వడంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సహకరించడంలేదని హైడ్రా కొంత గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. నెలలు గడిచినా కూడా వివరాలు ఇవ్వడంలేదని, పలుమార్లు అడిగినా కూడా వారి నుంచి స్పందన కనిపించకపోవడంతో వారి విషయాన్ని హైడ్రా ఛైర్మన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళాలని రంగనాథ్ యోచిస్తున్నట్టు సమాచారం.

గతంలోనూ ఇదే తంతు
హెచ్‌ఎండిఏ పరిధిలోని చెరువుల పరిరక్షణకు ఏర్పాటైన లేక్ ప్రొటెక్షన్ కమిటీకి ఛైర్మన్‌గా హెచ్‌ఎండిఏ కమిషనర్ వ్యవహరించారు. హెచ్‌ఎండిఎ పరిధిలోకి ఏడు జిల్లాల కలెక్టర్లు వస్తారు. అథారిటీ పరిధిలో మొత్తం 2857 చెరువులు ఔటర్ లోపల 455, ఔటర్ వెలుపల 2402 ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ణయించి.. వాటి వివరాలను ఇవ్వాలని ఛైర్మన్ కోరినా జిల్లాల కలెక్టర్లు అందుకు సహకారాన్ని అందించలేదనే విమర్శలున్నాయి. దీంతో అసహనానికి లోనైన లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్.. పలు మార్లు కమిటీ సమావేశాలను నిర్వహించారు. వారికి పదేపదే గుర్తుచేసినా.. వివరాలు అందించలేదు. ఫలితంగా ప్రాథమిక నోటిఫికేషన్, ఫైనల్ నోటిఫికేషన్‌ల ప్రక్రియ పూర్తికావడం లేదనేది ప్రచారంలో ఉన్నది.

రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చెరువుల వివరాలు ఇస్తే.. వారిపై ఎలాంటి కేసులు నమోదవుతాయోననే ఆందోళన వారిలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. నగర శివారు జంట జలాశయాల పరిధిలోని జీఓ 111 వర్తించదని కొన్ని ఆస్తులకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు తప్పుడు నివేదిక ఇచ్చినట్టు పురపాలక శాఖకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల తెలియజేస్తూ.. వారిపై విభాగపరమైన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఇది గుర్తించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఔటర్ లోపలి వైపున్న చెరువుల వివరాలను హైడ్రాకు ఇవ్వడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి చైర్మన్ రంగనాథ్ ఏవిధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News