Wednesday, January 22, 2025

అక్రమ నిర్మాణాలపై హెచ్‌ఎండిఏ కొరడా

- Advertisement -
- Advertisement -

కబ్జాదారులపై ఫిర్యాదు
జవహర్‌నగర్‌లో అధికారుల స్పెషల్‌డ్రైవ్

హైదరాబాద్: అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో హెచ్‌ఎండిఏ దూకుడు పెంచింది. జవహర్‌నగర్‌లోని హెచ్‌ఎండిఏ స్థలాల్లో మూడు ఇంటి నిర్మాణాలు, ఐదు బేస్‌మెంట్‌ల పాటు కాంపౌండ్ వాల్స్, కరెంటు స్తంభాలను నేలమట్టం చేసిన హెచ్‌ఎండిఏ అధికారులు, కబ్జాదారులపై జవహర్ నగర్ పిఎస్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించారు. కొన్ని రోజులుగా జవహర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని హెచ్‌ఎండిఏకు చెందిన ఖాళీ స్థలాలపై అధికారులు స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఆ స్థలాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై హెచ్‌ఎండిఏ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు.

తాజాగా జవహర్‌నగర్‌లోని హెచ్‌ఎండిఏ భూముల్లో అక్రమ నిర్మాణదారులపై మంగళవారం ఉదయం హెచ్‌ఎండిఏ ఎస్టేట్ అధికారులు, ఎన్‌ఫోర్స్ మెంట్ యంత్రాంగం స్థానిక పోలీసుల సహకారంతో సంయుక్తంగా కూల్చివేశాయి. హెచ్‌ఎండిఏ పరిధిలోని పలు సర్వే నెంబర్లలో దాదాపు మూడు వేల (3,000) గజాల స్థలాల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు. వాటిల్లో మూడు ఇళ్లు, ఐదు బేస్‌మెంట్లతో పాటు కొన్ని కరెంటు స్తంభాలు, కొన్నిచోట్ల కాంపౌండ్ వాల్స్‌కు సంబంధించిన అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝుళిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News