Sunday, December 22, 2024

తవ్వే కొద్దీ అక్రమాలు వెలుగులోకి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఎసిబి అధికారుల సోదాల్లో హెచ్‌ఎండిఎ మాజీ డైరెక్టర్ శివరామకృష్ణ అక్రమాలు తవ్వేకొద్దీ వెలుగు చూస్తున్నా యి. ఎసిబి సోదాల్లో రూ.100 కోట్ల పైబడి అక్రమాస్తులు గుర్తించినట్లు చెబుతున్నప్పటికీ దాదాపుగా అక్రమాస్తులు రూ.500 కోట్ల పై మాటేనని చెబుతున్నారు. మరోవైపు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హెచ్‌ఎండిఎ మాజీ డైరెక్టర్, రేరా కార్యదర్శి శివబాలకృష్ణకు ఎసిబి కోర్టు ఫిబ్రవరి 8 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. బాలకృష్ణను ఎసిబి అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా, రెరా కార్యదర్శి, గతంలో హెచ్‌ఎండిఎ ప్లానింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన శివబాలకృష్ణను అక్రమ ఆస్తుల కేసులో ఎసిబి అరెస్టు చేసింది. బుధవారం ఉదయం నుంచి శివబాలకృష్ణ ఇల్లు, కార్యాలయం, ఆయన బంధువుల ఇండ్లలో సోదాలు నిర్వహించిన ఎసిబి అధికారులు గురువారం తెల్లవారుజామున 3 గంటలకు అదుపులోకి తీసుకున్నారు.

రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించిన అధికారులు లాకర్లు తెలిస్తే మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. బినామీల పేరుతో వందల కోట్ల ఆస్తులను కూడబెట్టినట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే వారిని విచారించి కీలక వివరాలు రాబట్టారు. ఈ మేరకు ఎసిబి ప్రెస్ నోట్ విడుదల చేసింది. బాలకృష్ణ ఇంటితో పాటు 16 ప్రదేశాల్లో సోదాలు చేశామని వెల్లడించింది. నిందితుడు బాలకృష్ణపై 13 (1) (b) , 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొంది. బాలకృష్ణ ఇళ్లతో పాటు, ఆయన బంధువులు, సహచురులు ఇళ్లల్లో సోదాలు చేశామని వెల్లడించింది. బాలకృష్ణ ఇంట్లో రూ.99 .60 లక్షల నగదు సీజ్ చేశామని తెలిపింది. 1988 గ్రాముల బంగారం, 6 కేజీల సిల్వర్ సీజ్ చేసినట్లు వివరించారు. రూ.8.26 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడిచింది.సీజ్ చేసిన ఆస్తుల విలువ మార్కెట్ వ్యాల్యూలో ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్పారు. మిగిలిన బీనామీలపై విచారణ చేయాల్సి ఉందని పేర్కొంది.

మిగతా అధికారుల్లో టెన్షన్
శివ బాలకృష్ణ అరెస్ట్‌తో హెచ్‌ఎండిఎలో పనిచేస్తున్న మిగతా అధికారుల్లో టెన్షన్ నెలకొంది. హెచ్‌ఎండిఎ పరిధి ఏడు జిల్లాల్లో విస్తరించి ఉండగా.. గతంలో అనుమతుల ఇచ్చిన ఫైల్స్ అన్నింటిని పరిశీలించే యోచనలో ఎసిబి ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో హైరేజ్ అపార్ట్మెంట్స్ కి అనుమతుల్లో వారు భారీగా లంచాలు పొందినట్లుగా ఎసిబి అధికారులు అనుమానిస్తున్నారు. ఎన్నికల కోడ్ రెండురోజుల ముందు భారీ ఎత్తున లాండ్ కన్జర్ వేషన్ జరిగిందని తెలుస్తోంది. ఉప్పల్ లో బాలకృష్ణ సోదరి ఇంట్లో కూడా ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. బాలకృష్ణ సోదరి ఇద్దరు కొడుకులు హెచ్‌ఎండిఎలో బాలక్రిష్ణ దగ్గరే పని చేశారు. బాలకృష్ణ సోదరి కొడుకులు ఇద్దరు బాలకృష్ణ బినామీలుగా ఉన్నట్లుగా గుర్తించారు. హైరైస్ బిల్డింగ్ జోన్ పరిధిలోకి భూముల మార్పు జరిగిందని భావిస్తున్నారు. ఉస్మాన్ సాగర్ పరిధిలో సైతం భారీగా భూ మార్పిడి జరిగిందని సమాచారం. ఆ రెండు రోజుల్లో రూ.200 కోట్ల భూములు చేతులు మారినట్టు ఎసిబి గుర్తించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News