Sunday, January 19, 2025

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ రిమాండ్ రిపోర్ట్

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎసిబి అధికారులు అరెస్టు చేసిన హెచ్‌ఎండిఏ డైరెక్టర్ శివబాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్‌లో ఎసిబి అధికారులు సంచనల విషయాలు వెల్లడించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అయితే బాలకృష్ణను వారం రోజుల పాటు కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో ఏసీబీ అధికారులు సంచలన విషయాలు వెల్లడించారు. 45 పేజీల రిమాండ్ రిపోర్టులో శివ బాలకృష్ణ విచారణకు ఏమాత్రం సహకరించలేదని ఏసీబీ పేర్కొంది. 1994లో గ్రూప్1 క్యాడర్‌లో సర్వీస్‌లోకి వచ్చిన శివ బాలకృష్ణ అనంతపురం, గుంటూరు, వైజాగ్, జీహెచ్‌ఎంసి, మున్సిపల్ శాఖల్లో కీలక పదవులు చేపట్టారు.

2021 నుండి 2023 వరకు హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌గా బాలకృష్ణ విధులు నిర్వర్తించారు. కాగా, పలు ఇన్ఫ్రా కంపెనీలపై కూడా ఏసీబీ సోదాలు నిర్వహించారు. సాయి సందీప్ ఇన్ఫ్రా, క్వారిజన్ స్పేస్, ఎస్‌ఎస్ కన్‌స్ట్రక్షన్‌లో సోదాలు చేవారు. ఉప్పల్‌లో బాలకృష్ణ సోదరి, కొర్రేములలో సోదరులు, హిమాయత్‌నగర్‌లో బామ్మర్ది నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేవారు. బినామీలను గుర్తించిన ఎసిబి అధికారులు ఫిర్జాదిగూడలో పెంట రమాదేవి, మైహోం భూజాలో కిరణ్ ఆచార్య, జూబ్లీహిల్స్ లో ప్రమోద్ కుమార్, మాదాపూర్‌లో కొమ్మిడి సందీప్ రెడ్డి, బాచుపల్లిలో సత్యనారాయణ మూర్తి నివాసాల్లో సహా 18 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. బినామీలను త్వరలోనే అదుపులోకి తీసుకుని విచారించనున్నట్లు తెలిసింది. వీరిని విచారిస్తే మరిన్ని ఆస్తులు బయటపడతాయని ఎసిబి అధికారులు భావిస్తున్నారు. అలాగే బ్యాంక్ లాకర్లను తెరిస్తే మరింత బంగారం, నగదు లభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

భారీగా లంచాలు డిమాండ్…
లేఅవుట్ అనుమతుల కోసం బాలకృష్ణ భారీగా లంచాలు డిమాండ్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్ పేర్కొన్నారు. దరఖాస్తుల్లో తప్పులు ఉన్నాయంటూ బాలకృష్ణ లాభాలు పొందినట్లు తెలిపారు. ప్లాట్‌లలో, నిర్మాణాల్లో, విల్లాలను కూడా లంచంగా తీసుకున్నాడు. బాలకృష్ణ ఆధ్వర్యంలో హెచ్‌ఎండీఏ, రెరాలో భారీగా అక్రమాలు జరిగాయని,హెచ్‌ఎండీలోని మూడు జోన్లపై బాలకృష్ణకు మంచిపట్టు ఉందని గుర్తించినట్లు తెలిపారు. బాలకృష్ణ సుదీర్ఘంగా కీలక పోస్ట్‌లో పనిచేశాడు. మరోవైపు బాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్నాక బ్యాంక్ లాకర్లను ఏసీబీ తెరిచే అవకాశం ఉంది. బాలకృష్ణకు సహకరించిన అధికారులపై కూడా ఏబీసీ విచారణ జరుపనున్నట్లు తెలిసింది. బాలకృష్ణకు హెచ్‌ఎండిలో సహకరించిన దాదాపు 30మంది అధికారులను ఎసిబి అధికారులు గుర్తించినట్లు తెలిసింది. వారికి సంబంధించిన అన్ని వివరాలను ఎసిబి అధికారులు సేకరిస్తున్నట్లు తెలిసింది. శివబాలకృష్ణ ఇల్లు, మరో 18 చోట్ల ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించగా భారీ ఎత్తున ఆస్తులు గుర్తించారు, ఆస్తులకు సంబంధించిన 50 పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

రూ. 4.9కోట్లు స్థిరాస్తులు, 8.2 కోట్ల చరాస్థులు, డాక్యుమెంట్ల ప్రకారం రూ.10 కోట్లు ఆస్తుల విలువ, బహిరంగ మార్కెట్‌లో 10 రెట్లు ఎక్కువ ఉన్నట్లు పేర్కొంది. పుప్పాలగూడ ఆదిత్య ఫోర్ట్ వ్యూలో విల్లా హౌజ్, సోమాజిగూడ లెజెండ్ తులిప్స్‌లో ఫ్లాట్, శేరిలింగంపల్లిలో అధితలో ఫ్లాట్, మల్కాజిగిరి, చేవెళ్లలో ప్లాట్స్ ఉన్నాయి. నాగరకర్నూల్‌లో 12.13 ఎకరాలు, చేవెళ్ల, అబ్దుల్లాపూర్, భువనగిరి, యాదాద్రి, జనగాం, సిద్దిపేట, గజ్వేల్, భూములు, ప్లాట్స్ ఉన్నాయి. రూ.99లక్షల నగదు, నాలుగు కార్ల విలువ రూ.51లక్షలు, బ్యాంకు బాలెన్స్ రూ.58 లక్షలు, గోల్ ్డ, సిల్వర్, వాచ్‌లు, ఫోన్స్, గృహోపకరణాలు మొత్తం వాల్యూ రూ.8కోట్ల 26లక్షలు ఉన్నాయి. రొలెక్స్, రాడో, ఫాసిల్, టిసాట్ బ్రాండెడ్ 120 హ్యాండ్ వాచ్‌లు స్వాధీనం చేసుకోగా వాటి విలువ రూ.32లక్షలు ఉంటుంది. ఆపిల్ ఫోన్స్, ట్యాబ్స్ 31 స్వాధీనం చేసుకోగా వాటి విలువ రూ.15 లక్షలు ఉంటుంది. ఎల్‌ఐసీ పాలసీ బాండ్స్ 20, ఐటీ రిటర్న్ డాక్యుమెంట్లు, నాలుగు బ్యాంకు పాస్‌బుక్స్, లాకర్స్, 155 డాక్యుమెంట్ షీట్స్, 4 పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News