Wednesday, November 6, 2024

అభివృద్ధిలో హెచ్‌ఎండిఎ కీలకం

- Advertisement -
- Advertisement -

HMDA is crucial in Hyderabad development

ఉద్యోగులు మరింత పట్టుదలతో పని చేయాలి
హెచ్‌ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్

మనతెలంగాణ/హైదరాబాద్ : అభివృద్ధిలో హెచ్‌ఎండిఎ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకంగా మారిందని స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మెట్రోపాలిటన్ కమిషనర్ అరవింద్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం హెచ్‌ఎండిఎ (అమీర్‌పేట్) ఆఫీసులో హెచ్‌ఎండిఎ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కార్యదర్శులు డి.వై.విజయ్‌కుమార్, ఎస్.శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో స్పెషల్ సిఎస్‌గా పదోన్నతి పొందిన అరవింద్ కుమార్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ హెచ్‌ఎండిఎ కమిషనర్‌గా అరవింద్‌కుమార్ వచ్చాకే హెచ్‌ఎండిఏకు పూర్వవైభవం వచ్చిందని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు మార్గదర్శకంలో హెచ్‌ఎండిఏ ఉద్యోగులు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మరింత దగ్గర అయ్యారన్నారు. ఉద్యోగులు ఎంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి సంస్థ పురోగతికి పాటు పడుతున్నారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు విశ్వ ప్రసాద్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేష్ చరణ్, కోశాధికారి సుధీర్ కుమార్, సభ్యులు, ఉమ, రాధిక గౌతమ్‌లు ఉన్నారు. స్పెషల్ సిఎస్‌గా పదోన్నతి పొందిన మెట్రోపాలిటన్ కమిషనర్ అరవింద్ కుమార్‌కు హెచ్‌ఎండిఎ అకౌంట్స్ విభాగం అధికారులు, ఉద్యోగులు అభినందనలు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News