Monday, December 23, 2024

మోకిల ప్లాట్లకు భారీగా డిమాండ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మోకిల లే అవుట్‌లో హెచ్‌ఎండిఎ నిర్వహించిన ప్రీ బిడ్ సమావేశానికి అనూహ్యమైనరీతిలో స్పందన వచ్చింది. శంకర్‌పల్లి మండలం, మోకిల ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఎ) మోకిల లేఅవుట్ ప్లాట్లకు భారీగా డిమాండ్ నెలకొంది. 165 ఎకరాల విస్తీర్ణంలో హెచ్‌ఎండిఏ 1,321 ప్లాట్లలతో కూడిన భారీ రెసిడెన్షియల్ లేఅవుట్ ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. మోకిల ప్లాట్లకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో హెచ్‌ఎండిఏ రెండో దశలో 300 ప్లాట్లను ఆన్ లైన్ వేలం ద్వారా విక్రయిస్తున్నది. దీనికి సంబంధించి గురువారం మోకిల లేఅవుట్ ప్రాంతంలో హెచ్‌ఎండిఏ నిర్వహించిన ప్రీబిడ్ సమావేశానికి అనూహ్యమైనరీతిలో స్పందన వచ్చింది.

హెచ్‌ఎండిఎ సెక్రెటరీ పి.చంద్రయ్య ఆధ్వర్యంలో జరిగిన ప్రీ బిడ్ సమావేశానికి హెచ్‌ఎండిఎ సిఐఓ ఎస్.కె.మీరా, సిపిఓ రవీందర్ రెడ్డి, ఇంజనీర్లు పరంజ్యోతి, అప్పారావు, చేవెళ్ల రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ సాయిరాం, శంకర్ పల్లి మండల తహశీల్దార్ సురేంద్రలతో పాటు హెచ్‌ఎండిఏ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రీబిడ్ సమావేశంలో ముందుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టిసి ప్రతినిధి అనురాగ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఈ వేలం ప్రక్రియలో పాల్గొనే పద్ధతులను వివరించారు. ఔత్సాహికులు అడిగిన ప్రశ్నలు, సందేహాలకు చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ సమాధానాలు ఇచ్చి వారి సందేహాలను నివృత్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News