Thursday, April 3, 2025

మోకిల ఫేజ్-2 భూముల వేలానికి హెచ్‌ఎండిఏ నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

300 ప్లాట్లలో 98,975 గజాల అమ్మకం
300 నుంచి 500 గజాల ప్లాట్లు అందుబాటులో
ఆగస్టు 21వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం

మనతెలంగాణ/హైదరాబాద్ :మోకిల ఫేజ్-2 భూముల వేలానికి హెచ్‌ఎండిఏ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 300 ప్లాట్లలో 98,975 గజాలను అమ్మకానికి పెట్టింది. ఈ లే ఔట్‌లో 300 నుంచి 500 గజాల ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఆగస్టు 21వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం హెచ్‌ఎండిఏ కల్పించింది. రూ. 1,180 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వేలంలో పాల్గొనే వారు రూ. లక్ష డిపాజిట్ చేయాలి. చదరపు గజానికి రూ. 25 వేలుగా కనీస ధర నిర్ణయించింది హెచ్‌ఎండిఏ. 98,975 గజాల అమ్మకంతో రూ. 800 కోట్లు రావొచ్చని హెచ్‌ఎండిఏ అంచనా వేస్తోంది. మోకిల ప్లాట్లకు సంబంధించి తొలి విడత వేలంలో గరిష్టంగా గజానికి రూ. 1.05 లక్షలు పలకగా, కనిష్టంగా గజానికి రూ. 72 వేలు పలికింది. మొదటి ఫేజ్‌లో గజానికి ప్రభుత్వానికి సరాసరిగా రూ. 80,397లకు పైగా ఆదాయం వచ్చింది. ప్రస్తుతం 98,975 గజాలకు రూ.8 వందల కోట్లు వచ్చే ఛాన్స్ ఉందని హెచ్‌ఎండిఏ భావిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News