మన తెలంగాణ/హైదరాబాద్:మరోసారి భూ ముల వేలానికి హెచ్‌ఎండిఏ సన్నద్ధమవుతోం ది. ఖాళీగా ఉన్న హెచ్‌ఎండిఏ భూములను గు ర్తించే పనిలో అధికారులు ఉన్నారు. అందులో భాగంగా గతంలో వేలం వేసిన భూములను ద క్కించుకున్న సంస్థలు వాటికి నిర్ణయించిన ధ రను చెల్లించకపోవడంతో వాటి కేటాయింపుల ను హెచ్‌ఎండిఏ అధికారులు రద్దు చేశారు. ఈ నేపథ్యంలోనే 500 ప్లాట్లను మరోమారు వేలం వేయాలని అధికారులు నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ ప్లాట్లను హెచ్‌ఎండిఏ విక్రయిస్తే సుమారు రూ.1,000 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో కోకాపేటలో హెచ్‌ఎండిఏ భూములను ఆన్‌లైన్ వేలం వేయగా, అక్కడ ఎకరం రూ.100 కోట్లు పలికింది.
అక్కడ కొన్ని భూములు అమ్ముడుపోయాయి. మరికొన్ని అమ్ముడుకాకపోవడంతో హెచ్‌ఎండిఏ వాటిని కూడా విక్రయించాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ క్రమంలోనే భూములు, ప్లాట్ల ఆన్‌లైన్ వేలానికి సంబంధించి ప్రభుత్వానికి లేఖ రాసినట్టుగా సమాచారం. ప్రస్తుతానికి హెచ్‌ఎండిఏకు పలు అభివృద్ధి పనులు చేయడానికి రూ.20 వేల కోట్ల వరకు అవసరం ఉంది. అయితే హెచ్‌ఎండిఏ పరిధిలో 1,000 ఎకరాల పైగా భూములు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే కొన్ని లే ఔట్‌లలోని ప్లాట్లను హెచ్‌ఎండిఏ అధికారులు విక్రయించగా విక్రయించని భూములు, ప్లాట్లను వేలం వేయాలని అధికారులు నిర్ణయించినట్టుగా తెలిసింది.
మార్కెట్ ‘భూమ్’లోకి రాగానే ఈవేలాన్ని…..
గత ప్రభుత్వం నిర్వహించిన భూముల వేలంలో భాగంగా బహదూర్‌పల్లిలోని 40 ఎకరాల్లో 101 ప్లాట్లు అమ్ముడవ్వగా, తొర్రూర్‌లో 117 ఎకరాల్లో 1,000 ప్లాట్లను సిద్ధం చేయగా, కొన్ని మాత్రమే అమ్ముడయ్యాయి. అలాగే మోకిలలో 165 ఎకరాల్లో 1,321 ప్లాట్లను వేలం వేయగా, భారీగానే ధర పలికింది. అయితే ఇక్కడ వేలంలో పాల్గొన్న కంపెనీలు తొలి వాయిదా చెల్లింపు విషయానికి వచ్చేసరికి చేతులు ఎత్తేశారు. ఈ ప్రాంతంలో ప్రైవేటు భూములు ఉన్న కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే రేట్లు పెంచినట్లు సమాచారం. ఆన్‌లైన్‌లో అధిక ధరకు కోట్ చేశారన్న ఆరోపణలు సైతం వచ్చాయి. ప్రస్తుతం ఈ లే ఔట్‌లో 80 శాతం ప్లాట్లు అందుబాటులోకి ఉన్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ భూమ్‌లోకి రాగానే ఈవేలాన్ని నిర్వహించాలని హెచ్‌ఎండిఏ అధికారులు భావిస్తున్నట్టుగా తెలిసింది.