Thursday, January 23, 2025

రూ.100 కోట్లకు పైగా ఆస్తులు…. బాలకృష్ణ అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హెచ్‌ఎండిఎ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ బాలకృష్ణను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. గురువారం తెల్లవారుజామున మూడు గంటలకు బాలకృష్ణను ఎసిబి అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం నుంచి హెచ్‌ఎండిఎ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ బాలకృష్ణ ఆస్తులపై ఎసిబి అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఎసిబి సోదాల్లో రూ.100 కోట్లకుపైగా స్థిర, చరాస్థులను గుర్తించారు. 14 టీమ్ లతో ఎసిబి అధికారులు సోదాలు చేపట్టారు. బ్యాంక్ డిపాజట్లతో పాటు బినామీలను గుర్తించారు. బ్యాంక్ లాకర్స్ పై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎసిబి అధికారులు దర్యాప్తు చేస్తుండగా బాలకృష్ణ కుటుంబ సభ్యులు సహకరించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News