- Advertisement -
దేశంలో హెచ్ఎంపివి కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న ఒక్క రోజే నాలుగు కేసులు గుర్తించగా.. మంగళవారం ఉదయం మరో మూడు కేసులు బయటపబడ్డాయి. తాజాగా, నాగ్ పూర్ రెండు కేసులు, తమిళనాడులోని చెన్నై, సేలంలో ఒక్కో కేసు నమోదు అయ్యింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 8 కేసులను గుర్తించారు. దేశంలో హెచ్ఎంపివి కేసులు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రద్దీ ప్రాంతాల్లో మాస్కులు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు, విస్తృతంగా టెస్టులు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం.. అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. కాగా, కొత్త వైరస్ రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
- Advertisement -