బెంగళూరులో ఇద్దరు శిశువులు, అహ్మదాబాద్‌లో మరో శిశువుకు
వైరస్ బెంగళూరు ఘటనలో కోలుకున్న ఒక చిన్నారి, మరో చిన్నారికి
కొనసాగుతున్న చికిత్స ఇది కొత్తది కాదు..ఆందోళన వద్దు : కేంద్రం స్పష్టీకరణ
న్యూఢిల్లీ : చైనాలో హెచ్‌ఎంపీవీ కలకలం సృష్టిస్తోన్న వేళ .. భారత్‌లో ఆ వైరస్‌ను గుర్తించారు. కర్ణాటకలో రెండు కేసులు వెలుగు చూసినట్టు ఐ సీఎంఆర్ వెల్లడించింది. గుజరాత్‌లో ఒక శిశు వుకు ఈ వైరస్ సోకింది. బెంగళూరులో 3,8 నె లల వయసున్న ఇద్దరు చిన్నారులకు వైరస్ నిర్ధారణ కాగా, అహ్మదాబాద్‌లో చిన్నారి మాత్రం ఇ దే వైరస్ లక్షణాలతో చికిత్స పొందుతోంది. దేశ వ్యాప్తంగా శ్వాసకోశ వ్యాధుల విషయంలో ఐసీఎంఆర్ సాధారణ పర్యవేక్షణలో భాగంగా ఈ రెండు కేసులు వెలుగు చూశాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. భారత్‌తోసహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తిలో ఉం దని, దానికి సంబంధించిన కేసులు నమోదయ్యాయని, దీనిపై ఆందోళన అవసరం లేదని పేర్కొంది. ఇదిలా ఉండగా మూడు నెలల చిన్నా రి వైరస్ నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చా ర్జి కాగా, మరో చిన్నారి చికిత్స పొందుతోంది. అ యితే వైరస్ వెలుగు చూసిన దేశాల్లో వీరి కు టుంబాలు ఎలాంటి ప్రయాణాలు చేయలేదని తెలియజేసింది. చైనాలో కనిపించిన రకం ఇదీ ఒకటేనా ? కాదా ? తెలియాల్సి ఉంది. హెచ్‌ఎంపీవీ వైరస్ లక్షణాలు కూడా ఫ్లూ , ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య ని పుణులు వెల్లడించారు. దగ్గు, జ్వరం, ముక్కు ది బ్బడగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇ బ్బంది వంటివి కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్ , నియోనియాకు దారి తీయవచ్చు. వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి మూడు నుంచి ఆరు రోజులు పడుతుంది.
అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం, చిన్నారులు, వృద్ధులు, బలహీనమైన రోగ నిరోధక శక్తి కలిగిన వ్యక్తులు దీనిబారిన పడే అవకాశాలు ఎక్కువ. చైనాలో హ్యూమన్ మెటానిమోవైరస్ (హెచ్‌ఎంపీవీ ) సహా పలు శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయన్న వార్తలతో భారత్ ఇప్పటికే అప్రమత్తమైంది. ఇటీవలే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డిజిహెచ్‌ఎస్) అధ్యక్షతన జాయింట్ మానిటరింగ్ గ్రూప్ (జెఎంజీ ) సమావేశం నిర్వహించింది. శీతాకాలంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగానే చైనాలో ఇన్‌ఫ్లూయెంజా. ఆర్‌ఎస్‌వీ, హెచ్‌ఎంపీవీ తరహా వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నాయని జెఎంజీ తేల్చింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే వివిధ చోట్ల ఆర్‌ఎస్‌ఏ , హెచ్‌ఎంపీవీ తదితర పరీక్షలు చేస్తున్నట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒకవేళ శ్వాసకోశ వ్యాధులు అనుకోకుండా పెరిగినా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. కాగా హెచ్‌ఎంపివి వైరస్ కొత్తమేమీ కాదని, దీనికి భయపడాల్సిన పనిలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జెపి నడ్డా స్పష్టం చేశారు.