Wednesday, January 22, 2025

అమెరికాకు బయల్దేరిన బ్రిటన్ యుద్ధనౌక బ్రేక్‌డౌన్

- Advertisement -
- Advertisement -

HMS Prince of Wales stuck in sea due to technical fault

లండన్: పోర్ట్‌మౌత్ నేవల్ బేస్ నుంచి అమెరికాకు బయల్దేరిన బ్రిటన్‌కు చెందిన అతి భారీ విమానవాహక నౌక హెచ్‌ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ సాంకేతిక లోపం కారణంగా నడిసముద్రంలో నిలిచిపోయింది. చారిత్రాత్మక వైమానిక విన్యాసాల కోసం అమెరికాకు వెళుతున్న ఈ విమానవాహక నౌక యాంత్రిక సమస్యను ఎదుర్కొంటోందని, దీనికి ఏర్పడిన సమస్యపై దర్యాప్తు జరుగుతోందని రాయల్ నేవీ ప్రతినిధి ఒకరు సోమవారం తెలిపారు. దక్షిణ కోస్తా విన్యాస ప్రాంతంలోనే హెచ్‌ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నిలిచి ఉందని, దీనిలో ఏర్పడిన సాంకేతిక సమస్యలపై దర్యాప్తు జరుగుతోందని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన వార్తను ఆన్‌లైన్ న్యూస్ వెబ్ సైట్ యుకె దిఫెన్స్ జర్నల్ మదటగా బయటపెట్టింది. ఉత్తర అమెరికా కోస్తాకు ఆవల డ్రోన్ ఆపరేషన్లు నిర్వహించి ఈ విమానవాహక నౌక పాటవాన్ని పరీక్షించడానికి అమెరికాకు ఈ యుద్ధవిమానం పయనమైనట్లు శనివారం రాయల్ నేవీ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News