Monday, December 23, 2024

ఎసిబి వలలో హెచ్‌ఎండబ్లూ అధికారి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హెచ్‌ఎండబ్లూఎస్ అండ్ ఎస్‌బి రికార్డుల్లో ఉన్న తన తల్లి పేరును మార్చేందుకు డబ్బులు డిమాండ్ చేసిన మేనేజర్‌ను ఎసిబి అధికారులు శనివారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కొండపల్లి యాదగిరి రెడ్డి హెచ్‌ఎండబ్లూస్ అండ్ ఎస్‌బిలో మేనేజర్(ఇంజనీరింగ్)గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్, అంబర్‌పేట, ఎంసిహెచ్ కాలనీ, సిటీ రేంజ్ 2లో పనిచేస్తున్నాడు. బాధితుడు బండి కేషవ్ తన తల్లి పేరులో సవరణ చేయాలని యాదగిరి రెడ్డిని కలిశాడు.

పేరుమార్చాలంటే రూ.10,000 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు విషయం ఎసిబి అధికారులకు చెప్పాడు. వారి సూచనల మేరకు కేశవ్, యాదగిరి రెడ్డికి రూ.10,000 ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తర్వాత నిర్వహించిన కెమికల్ టెస్ట్‌లో నిర్ధారణ కావడంతో యాదగిరి రెడ్డిని అరెస్టు చేసి ఎసిబి కోర్టులో హాజరు పర్చారు. కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు జైలుకు పంపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News