Monday, December 23, 2024

బషీర్‌బాగ్ ఐటి ఆఫీసుకు బూటకపు బాంబు బెదిరింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని బషీర్‌బాగ్‌లో ఉన్న ఆదాయం పన్ను కమిషనర్ కార్యాలయానికి సోమవారం మధ్యాహ్నం బూటకపు బాంబు బెదిరింపు వచ్చింది. భవనంలో బాంబు ఉంచినట్లు ఒక గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేయడంతో కార్యాలయం వద్ద భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి.

కార్యాలయంలో బాంబు ఉన్నట్లు తెలియడంతో ఐటి శాఖలో పనిచేసే ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. పోలీసులు, పోలీసు జాగిలాలు, బాంబు నిర్వీర్య బృందాలు భవనంలోకి ప్రవేశించి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. చివరకు అది బూటకపు బాంబు బెదిరింపు అని తేలడంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.

కాగా..బషీర్‌బాగ్ కార్యాలయంలో బాంబు పెట్టినట్లు బెదిరిఒంపు కాల్ రావడంతో ఎసి గార్డ్‌లోని ఆదాయం పన్ను శాఖ కార్యాలయంలో కూడా అదే రకమైన పరిస్థితి నెలకొంది. ఉద్యోగులు భయంతో కార్యాలయం బయటకు చేరుకున్నారు. స్థానిక పోలీసులు, బాంబు నిర్వీర్య బృందాలు కార్యాలయం చేరుకుని తనిఖీలు నిర్వహించాయి. చివరకు బాంబు వంటిదేదీ లేదని పోలీసులు తేల్చారు. ఈ బాంబు బెదిరింపు కారణంగా కొన్ని గంటలపాటు కార్యాలయంలో కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News