- Advertisement -
బెంగళూరు: కర్నాటక రాజ్‌భవన్‌కు సోమవారం రాత్రి ఒక బూటకపు బాంబు బెదిరింపు వచ్చింది. రాజ్‌భవన్‌లో బాంబు పెట్టినట్లు ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెంగళూరు పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే రాజ్‌భవన్‌కు బాంబు స్కాడ్‌ను పోలీసులు పంపించగా బాంబు ఏదీ లభించలేదు. బాంబు బెదిరింపుపై కేసు నమోదు చేసి మరోసారి తనిఖీలు నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. ఇది బూటకపు బెదిరింపని పోలీసు వర్గాలు తెలిపాయి. ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని వారు చెప్పారు. సోమవారం అర్ధరాత్రి ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి కంట్రోల్ రూముకు ఫోన్ కాల్ వచ్చిందని, రాజ్‌భవన్‌లో బాంబు పెట్టినట్లు ఆ వ్యక్తి బెదిరించాడని పోలీసులు తెలిపారు.
- Advertisement -