Tuesday, September 10, 2024

ముగింపు వేడుకల్లో పతాకధారిగా శ్రీజేశ్

- Advertisement -
- Advertisement -

పారిస్: విశ్వక్రీడలు ఒలింపిక్స్ ముగింపోత్సవ కార్యక్రమంలో భారత పతాకధారిగా హాకీ గోల్‌కీపర్ శ్రీజేశ్‌కు కూడా అవకాశం దక్కింది. ఇప్పటికే యువ షూటర్ మను బాకర్‌ను ముగింపు వేడుకల్లో పతాకధారిగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా సీనియర్ గోల్‌కీపర్ శ్రీజేశ్‌కు కూడా అవకాశం కల్పించారు. ఈ విషయాన్ని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉష వెల్లడిచారు. శ్రీజేశ్ గత రెండు దశాబ్దాలకుపైగా భారత హాకీ ఎనలేని సేవలందించారన్నాడు. అంతేగాక భారత హాకీ వరుసగా రెండు ఒలింపిక్స్‌లోనూ కాంస్య పతకాలు సాధించడంలో శ్రీజేశ్‌ది కూడా చాలా కీలకపాత్ర అని ఉష పేర్కొన్నారు. ఇలాంటి ఆటగాడికి అరుదైన గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ముగింపు వేడుకల్లో పతాకధారిగా అవకాశం కల్పించినట్టు ఉష తెలిపారు. శ్రీజేశ్‌ను పతాకధారిగా ఛాన్స్ ఇవ్వాలని చాలా మంది క్రీడాకారులు కోరారని, జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా కూడా దీనికి సుముఖత వ్యక్తం చేసినట్టు వెల్లడించారు. అందరి అభిష్ఠం మేరకు శ్రీజేశ్‌కు ఈ అరుదైన అవకాశం కల్పించినట్టు ఉష వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News