- Advertisement -
కోల్‌కాతా: రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత, దిగ్గజ హాకీ ఆటగాళ్ళలో ఒకరైన కేశవ్ చంద్ర దత్ మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం కోల్ కత్తాలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1948 లండన్ ఒలింపిక్స్‌తో పాటు 1952 హెల్సింకీ విశ్వక్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన హాకీ జట్టులో కేశవ్ సభ్యుడిగా ఉన్నారు. ఆయన మృతిపై హాకీ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంతాపం ప్రకటించాయి.
hockey player Keshav Chandra Datt passes away
- Advertisement -